
📌 Key Points
- పశ్చిమ బెంగాల్‌లోని బలూర్‌ఘాట్‌లో న్యూ ఇయర్ ఈవ్ కాన్సర్ట్‌లో సచేత్-పరంపర పాల్గొన్నారు.
- వేడుకల అనంతరం వారి కారును అభిమానులు చుట్టుముట్టగా, తోపులాటలో వెనుక అద్దం పగిలిపోయింది.
- పరంపర అభిమానులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, జనం అదుపు తప్పడంతో సచేత్ దిగ్భ్రాంతికి గురయ్యారు.
- భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ, అభిమానులు సెల్ఫీలు, వీడియోల కోసం కారును వదలకుండా ఎగబడ్డారు.
పాపులర్ సింగర్స్‌గా పేరు పొందిన సచేత్-పరంపరకు న్యూ ఇయర్ వేడుకల అనంతరం చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ బెంగాల్‌లోని ఒక కాన్సర్ట్ ముగించుకుని వస్తుండగా వారి కారుపై అభిమానులు దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దం పగిలిపోగా, సింగర్స్ షాక్‌కు గురయ్యారు.
న్యూ ఇయర్ వేడుకల తర్వాత షాకింగ్ ఘటన
పాపులర్ సింగర్స్‌గా సచేత్-పరంపర మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. భార్యాభర్తలైన వీరిద్దరు పశ్చిమ బెంగాల్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఈ సంగీత ద్వయం సచేత్-పరంపర కారును అభిమానులు చుట్టుముట్టారు. ఈ తోపులాటలో కారు వెనుక అద్దం పగిలిపోవడంతో సింగర్స్ షాక్‌కు గురయ్యారు.
2026 న్యూ ఇయర్ వేడుకల్లో పాటలు ఆలపించి అందరినీ ఉత్సాహపరచాలని వచ్చిన ఆ సంగీత కళాకారులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్స్, సింగర్స్, భార్యాభర్తలు సచేత్ టాండన్, పరంపర ఠాకూర్ (సచేత్-పరంపర)కు మంచి క్రేజ్ ఉంది.
తాజాగా సచేత్-పరంపరకు న్యూ ఇయర్ వేడుకల్లో చేదు అనుభవం ఎదురైదంది. వీరు ప్రయాణిస్తున్న కారు అభిమానుల దాడికి గురైంది. కారును అభిమానులు చుట్టుముట్టడమే కాకుండా.. కారు అద్దాలను కూడా పగలగొట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని బలూర్‌ఘాట్‌లో న్యూ ఇయర్ ఈవ్ కాన్సర్ట్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
అదుపు తప్పిన అభిమానులు: సెక్యూరిటీ వైఫల్యం?
దీంతో సచేత్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పరంపర “గాయ్స్.. కొంచెం రిలాక్స్ అవ్వండి.. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్” అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, జనం అదుపు తప్పడంతో కారు వెనుక ఉన్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది.
ఆ శబ్దానికి సచేత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురవ్వగా, “పోయింది.. అద్దం పగిలిపోయింది (గయా.. గయా)” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది ఎంత ప్రయత్నించినా అభిమానులు కారును వదలకుండా సెల్ఫీలు, వీడియోల కోసం ఎగబడ్డారు.
సచేత్-పరంపర: వారి కెరీర్, తాజా విజయాలు
కాన్సర్ట్‌లో తమ పాటలతో ఉర్రూతలూగించిన సచేత్-పరంపరపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “మిమ్మల్ని లైవ్‌లో చూడటం అద్భుతంగా ఉంది”, “నా న్యూ ఇయర్‌ను బెస్ట్‌గా మార్చేశారు” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
2020లో వివాహం చేసుకున్న సచేత్-పరంపర జంట ఇటీవలే ‘ సయ్యారా ‘, ‘సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి’ వంటి చిత్రాల్లోనూ పాటలు పాడారు.
అభిమానుల ఆదరణ ఎంత ముఖ్యమో, వారి అతి ఉత్సాహం కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీస్తుంది. సెలబ్రిటీల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.


