
ఓటీటీలోకి కొత్త హారర్ థ్రిల్లర్ సినిమా వచ్చింది – సిన్నర్స్! ఇద్దరు ట్విన్ బ్రదర్స్, దెయ్యాలను పిలిచే సంగీతం, మరియు అనూహ్యమైన ట్విస్టులతో కూడిన ఈ సినిమా గురించి తెలుసుకుందాం.
Key Points
ట్విన్ బ్రదర్స్ యొక్క ప్రమాదకరమైన వ్యాపారం
దెయ్యాలను ఆకర్షించే సంగీతం
అదిరిపోయే ట్విస్టులు, ఆసక్తికరమైన కథ
ట్విన్ బ్రదర్స్ యొక్క ప్రమాదకరమైన ప్రణాళిక
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో జోనర్ ఎలాంటిదైన కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తుంటారు. అయితే, మినిమమ్ గ్యారెంటీ ఉన్న జోనర్లలో హారర్ థ్రిల్లర్స్ ఒకటి. ఈ జోనర్ టైప్ సినిమాలను చూసేందుకు ఓటీటీ ఆడియెన్స్ కాస్తా ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
అందుకే, ఎప్పుడు ఎలాంటి హారర్ సినిమాలు వచ్చిన వాటిపై ఓటీటీ లవర్స్ ఫోకస్ ఉంటుంది. అయితే, ఈ వారం కూడా ఓ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా నిన్నటి (సెప్టెంబర్ 18) నుంచే ఆ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీనే సిన్నర్స్. అదిరిపోయే ట్విస్టులతో సాగే సిన్నర్స్‌లో హారర్ మాత్రమే కాకుండా మల్టీపుల్ లేయర్స్ ఉన్నాయి.
భయపెట్టే హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన సిన్నర్స్‌లో శృంగారం వంటి బోల్డ్ సీన్స్ సైతం ఉన్నాయి. అలాగే, ఇందులోని దెయ్యాలు జాంబీల తరహాలో ప్రవర్తిస్తుంటారు. అది డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉంటుంది. ఇద్దరు క్రిమినల్ ట్విన్ బ్రదర్స్ గ్యాంగ్‌స్టర్స్ దగ్గర డబ్బులు కొట్టేసి దాంతో బిజినెస్ పెట్టాలనుకుంటారు.
దెయ్యాల ఆక్రమణ
అందుకోసం ఓ ప్రాంతంలోని సామిల్ కొనుక్కుని అందులో జ్యూక్ పాయింట్ పెడతారు. అక్కడికి వచ్చే కస్టమర్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు ఓ సింగర్, మ్యూజిక్ బ్యాండ్‌ను రిక్రూట్ చేసుకుంటారు. అయితే, ఓపెనింగ్ రోజున కస్టమర్స్ భారీగా వస్తారు. వారిని అలరించేందుకు వివిధ రకాలుగా మ్యూజిక్, సాంగ్స్, డ్యాన్స్ వంటి కార్యక్రమాలు నడుస్తుంటాయి.
ఇదే క్రమంలో ఆత్మలను అట్రాక్ట్ చేసే సంగీతం ప్లే అవడంతో అక్కడికి దెయ్యాలు వస్తుంటాయి. ఆ సంగీతం దెయ్యాలను పిలిచేలా ఉంటుంది. అలా వరుసగా దెయ్యాలు ఆ జ్యూక్ పాయింట్‌ను చుట్టు ముడతాయి. వాటి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడేందుకు ట్విన్ బ్రదర్స్ పోరాటం చేస్తారు.
అనూహ్యమైన ట్విస్టులు
మరి నిజంగా వాళ్లు తప్పించుకున్నారా? అసలు అక్కడ దెయ్యాలు ఎందుకు ఉన్నాయి? ఆ సంగీతానికి వాటికి ఉన్న సంబంధం ఏంటీ? దెయ్యాలో చేతుల్లో చనిపోయిన వారు ఏమవుతున్నారు? వంటి విషయాలు తెలియాలంటే థ్రిల్లింగ్, బోల్డ్, యాక్షన్ సీన్లతోపాటు ట్విస్టులు అదుర్స్ అనిపించే సిన్నర్స్ చూడాల్సిందే.
సెప్టెంబర్ 19 నుంచి సిన్నర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌స్టార్ అంటే ఒకప్పటి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సిన్నర్స్ ఓటీటీ రిలీజ్ అయింది. సిన్నర్స్ మూవీకి మార్వెల్ బ్లాక్ పాంథర్, బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించడం విశేషం.
సిన్నర్స్ సినిమాలో హారర్, యాక్షన్, థ్రిల్లర్ అన్నీ కలిసి అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. అదిరిపోయే ట్విస్టులతో కూడిన ఈ సినిమా మిమ్మల్ని కట్టిపడేస్తుంది. తప్పకుండా చూడండి!


