|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అతడితో సహజీవనం చేస్తూ సిరి హనుమత్ వరలక్ష్మీ వ్రతం చేయడం తప్పు..దుమ్మెత్తి పోసిన ప్రముఖ జ్యోతిష్యుడు

Published: 11-08-2025, 9:41 PM
అతడితో సహజీవనం చేస్తూ సిరి హనుమత్ వరలక్ష్మీ వ్రతం చేయడం తప్పు..దుమ్మెత్తి పోసిన ప్రముఖ జ్యోతిష్యుడు

బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమత్ తన బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ తో కలిసి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించింది. ఈ కార్యక్రమంపై ప్రముఖ జ్యోతిష్యుడు మురళీశర్మ తీవ్రంగా విమర్శించారు.

Key Points

1

సిరి హనుమత్, శ్రీహాన్ సహజీవనం చేస్తున్నారు.

2

వీరు కలిసి వరలక్ష్మీ వ్రతం చేశారు.

4

వివాహం కాని జంట వేరు వేరు గోత్రాల కారణంగా ఇది తప్పు అని ఆయన అభిప్రాయం.

సిరి హనుమత్ వరలక్ష్మీ వ్రతం

భారతదేశంలో మహిళలకు వరలక్ష్మీ వ్రతం పండుగ చాలా పవిత్రమైనది. వివాహమైన మహిళలు తమ భర్త క్షేమం కోసం ఈ వ్రతం చేస్తారు. అదే విధంగా పెళ్లి కావలసిన అమ్మాయిలు కూడా వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. సెలెబ్రిటీలు తమ ఇళ్లలో వరలక్ష్మీ వ్రతం చేసుకుని ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ వివాదంలో చిక్కుకుంది.

సిరి హనుమంత్, శ్రీహాన్ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ సహజీవనం చేస్తున్నారు. ఇటీవల సిరి హనుమంత్, శ్రీహాన్ తో కలిసి వరలక్ష్మీ వ్రతం ఆచరించింది. భక్తి శ్రద్దలతో ఈ జంట పూజలు చేశారు. ఆ దృశ్యాలని సిరి హనుమంత్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

జ్యోతిష్యుని విమర్శలు

సిరి హనుమంత్, శ్రీహాన్ తో కలిసి వరలక్ష్మీ వ్రతం చేయడాన్ని ప్రముఖ జ్యోతిష్యుడు మురళీశర్మ తీవ్రంగా తప్పు పట్టారు. ఆయన తెలంగాణ బ్రాహ్మణ సేన అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. సిరి హనుమంత్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వరలక్ష్మీ వ్రతం చేయడం గురించి మురళీశర్మ మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో వింత పోకడలు సమాజంలోకి కూడా ప్రవేశించాయి అని అన్నారు.

మన సనాతన ధర్మ వ్యవస్థలో కొన్ని నియమాలు ఉన్నాయి. వరలక్ష్మీ వ్రతం చేయాలన్నా, ఏదైనా దేవాలయంకి వెళ్లి పూజలు చేయాలన్నా గోత్ర నామాలు ముఖ్యమైనవి. సిరి హనుమంత్, శ్రీహాన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. మరి వీరిద్దరూ కలిసి ఎవరి గోత్రం చెబుతారు అని మురళీశర్మ ప్రశ్నించారు. స్త్రీకి పెళ్ళైన తర్వాత భర్త గోత్రం సంక్రమిస్తుంది అని అన్నారు.

సహజీవనం వివాదం

ఇంకా సిరి హనుమంత్, శ్రీహాన్ లకు వివాహం కాలేదు కాబట్టి వీరిద్దరి గోత్రాలు వేరుగా ఉంటాయి. కాబట్టి వారిద్దరూ కలిసి వరలక్ష్మీ వ్రతం చేయడం తప్పు అని మురళీశర్మ అన్నారు. పెళ్లి కానీ అమ్మాయిలకు తన తండ్రి నుంచి వచ్చిన గోత్రమే ఉంటుంది. పెళ్లయ్యాక ఆమె గోత్రం మారుతుంది. సిరి హనుమంత్ కావాలంటే సింగిల్ గా పూజ చేసుకోవచ్చు. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని మురళీశర్మ అన్నారు. సిరి హనుమంత్ బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడూ సినిమా అవకాశాలు కూడా సిరి అందుకుంటోంది.

మురళీశర్మ విమర్శలతో సిరి హనుమత్ వరలక్ష్మీ వ్రతం ఆచరణ వివాదాస్పదమైంది. సనాతన ధర్మం ప్రకారం ఈ విషయం తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.