|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సీతాపయనం సంచలనం: అర్జున్ కూతురి సరసన హీరో ఎవరు? అతని నేపథ్యం తెలుసా?

Published: 11-02-2026, 2:05 AM
సీతాపయనం సంచలనం: అర్జున్ కూతురి సరసన హీరో ఎవరు? అతని నేపథ్యం తెలుసా?
  • అర్జున్ దర్శకత్వంలో సీతాపయనం మూవీలో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా పరిచయం.
  • ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న చిత్రం.
  • హీరో నిరంజన్ ఉపేంద్ర అన్న కొడుకు అని ఈవెంట్లో వెల్లడించిన అర్జున్.
  • మాస్ యాక్షన్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి చిత్రం రూపొందింది.

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో సీతాపయనం మూవీ వస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న నిరంజన్ ఉపేంద్ర అన్న కొడుకు అని అర్జున్ తెలిపారు.

సీతాపయనం మూవీ విశేషాలు

SitaPayanam Movie: విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun ) దర్శకత్వంలో వస్తున్న కొత్త మూవీ సీతాపయనం(Sita payanam). శ్రీరాం ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా ద్వారా అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun)హీరోయిన్ గా సినిమా తెరకు పరిచయం కాబోతున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో, ఆయన మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జ (Dhruva Sarja) కీలక పాత్రలో పోషిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు , తమిళ్, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బ్యూటిఫుల్ విజువల్స్ , హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఒక కారులో హీరో హీరోయిన్లు చేసే ప్రయాణం ..వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. పైగా ధ్రువ సర్జా చేసిన పోరాట సన్నివేశాలు మరింత అట్రాక్షన్ గా నిలిచాయని చెప్పవచ్చు. మొత్తానికైతే మాస్ యాక్షన్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాలతో ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది ఈ సినిమా.

ఇక ఇదంతా బాగానే ఉన్నా.. ఈ సినిమాలో తన అద్భుతమైన నేచురల్ పెర్ఫార్మన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు ఈ సినిమా హీరో నిరంజన్(Niranjan ). ఇకపోతే ఈయన ఎవరు? ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అని తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఐశ్వర్య అర్జున్ సరసన హీరోగా నటిస్తూ.. ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చిన ఇతడు ఎవరు? ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

హీరోగా నిరంజన్ పరిచయం

అసలు విషయంలోకి వెళ్తే.. విడుదల తేదీకి దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న అర్జున్ ఈ సినిమా హీరో గురించి , ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అర్జున్ మాట్లాడుతూ..” ఈ సినిమాలో నా కూతురు హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. హీరోగా నటిస్తున్న అబ్బాయి గురించి మీకు చెప్పాలి. ఆ అబ్బాయి ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) అన్న కొడుకు నిరంజన్. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో నా కూతురు కోసం నేను సినిమా తీసినా.. హీరోయిన్ కి సమానంగా హీరో క్యారెక్టర్ ను కూడా డిజైన్ చేశాను. వీరిద్దరి పాత్రలకు ఉండే ఎలివేషన్లు ఆ పాత్రలో ఉండే డిఫరెంట్ షేడ్స్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి” అంటూ అర్జున్ చెప్పుకొచ్చారు . మొత్తానికైతే ప్రముఖ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అన్న కొడుకు ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడని తెలిసి సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

అలా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న నిరంజన్, ఐశ్వర్య అర్జున్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి. ఇకపోతే హీరో నిరంజన్ కి కన్నడ సెలబ్రిటీలతో మంచి అవినాభావ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కిచ్చా సుదీప్ తో పాటూ పలువురు హీరోయిన్స్ తో కూడా మంచి రిలేషన్ కొనసాగిస్తున్నట్లు సమాచారం మరొకవైపు కన్నడ లో ‘ హంటర్ ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారుk

నిరంజన్ గురించి అర్జున్ వెల్లడి

సీతాపయనం మూవీ విడుదల దగ్గర పడుతున్న వేళ హీరో నిరంజన్ గురించి అర్జున్ చెప్పిన విషయాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఫిబ్రవరి 14న సినిమా విడుదల కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.