
📌 Key Points
- ‘సీతా పయనం’ చిత్రం నాలుగు రోజుల్లో రూ. 8.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
- ఈ చిత్రానికి అర్జున్ దర్శకత్వం వహించడంతో పాటు, తన కుమార్తె ఐశ్వర్యను పరిచయం చేశారు.
- ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
- సాయి మాధవ్ బుర్రా మాటలు, అనూప్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ‘సీతా పయనం’. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. నాలుగు రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసిందో చూద్దాం.
‘సీతా పయనం’ కలెక్షన్ల వివరాలు
Seetha Payanam: టాలీవుడ్‌లో గత వారం విడుదలైన చిత్రాల్లో ‘సీతా పయనం’ (Seetha Payanam) సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ వద్ద వయలెంట్‌గా సౌండ్ చేస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ (Action King Arjun) తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun)ను వెండితెరకు పరిచయం చేస్తూ, స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) కానుకగా విడుదలైన ఈ మూవీ, ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో నాలుగు రోజులకుగానూ ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..
సినిమాకు ప్లస్ పాయింట్స్ ఏంటి?
సాధారణంగా వారసుల ఎంట్రీ అంటే భారీ అంచనాలు ఉంటాయి. కానీ అర్జున్ ఎంచుకున్న కథాంశం, మేకింగ్ వాల్యూస్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తాజాగా మేకర్స్ వదిలిన పోస్టర్ ప్రకారం, ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 8.7 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సత్తా చాటింది. ఫిబ్రవరి వంటి డల్ సీజన్‌లో కూడా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం అంటే, సినిమా కంటెంట్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయిందనే అనుకోవచ్చు. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో రోజురోజుకూ వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమాకు థియేటర్లు కూడా పెంచుతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.
బాక్సాఫీస్ వద్ద సినిమా ఫలితం ఎలా ఉంది?
సంక్రాంతి సినిమాల తర్వాత పెద్దగా హిట్ పడలేదు. ఆ లెక్కన చూస్తే ఈ సినిమా హిట్టనే చెప్పుకోవాలి. తండ్రిగా అర్జున్ తన కుమార్తెని ఎలా ప్రెజెంట్ చేయాలో అంతకంటే బెటర్‌గా చూపించారు. సాయి మాధవ్ బుర్రా పవర్ ఫుల్ మాటలు సినిమాకు ప్రాణం పోశాయి. అనూప్ అందించిన మెలోడీ సాంగ్స్, సీన్లను ఎలివేట్ చేసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. సినిమాలో అర్జున్ స్వయంగా మెరవడంతో పాటు, ధృవ్ సర్జా స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వడం మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. అలాగే హీరోయిన్‌గా పరిచయమైన ఐశ్వర్య అర్జున్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రను ఎంచుకోవడం ఆమెకు ప్లస్ అయ్యింది. ఇక ఉపేంద్ర వారసుడు నిరంజన్ కూడా తన నటనతో ఆకట్టుకుని ప్రామిసింగ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మొత్తంగా అయితే, ‘సీతా పయనం’ బాక్సాఫీస్ వద్ద సేఫ్ జోన్‌లోకి వెళ్ళడమే కాకుండా, లాభాల బాట పట్టిందనేలా టాక్ నడుస్తుంది.
మొత్తానికి ‘సీతా పయనం’ సినిమా ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాలలో మంచి విజయాన్ని అందుకుంది. కొత్త హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ నటనకు ప్రశంసలు దక్కడం విశేషం.


