|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అవన్నీ నకిలీ అకౌంట్లే.. నాకున్నది ఒక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే: ఫాలోవర్లకు మహేష్ బాబు కూతురు సితార సూచన

Published: 19-08-2025, 1:18 PM
అవన్నీ నకిలీ అకౌంట్లే.. నాకున్నది ఒక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే: ఫాలోవర్లకు మహేష్ బాబు కూతురు సితార సూచన

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార తన పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు పుట్టుకొస్తున్నాయని తెలిపింది. ఆమె అధికారిక ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే ఉందని హెచ్చరించింది.

Key Points

1

సితార ఘట్టమనేని తన పేరుతో ఉన్న నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల గురించి హెచ్చరించింది.

2

ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే అధికారిక ఖాతా ఉందని తెలిపింది.

4

ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఆమెకు ఖాతాలు లేవని ఆమె స్పష్టం చేసింది.

సితార యొక్క ఇన్‌స్టాగ్రామ్ హెచ్చరిక

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార తెలుసు కదా. ఇన్‌స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉండే అత్యంత కొద్ది మంది సెలబ్రిటీల వారసుల్లో ఆమె కూడా ఒకరు. ఇన్‌స్టాలో ఎప్పుడూ ఆమె ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా తన పేరిట పుట్టుకొస్తున్న నకిలీ అకౌంట్ల గురించి మంగళవారం (ఆగస్టు 19) ఆమె ఓ పోస్ట్ చేసింది.

మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఫేక్ అకౌంట్ల గురించి చెబుతున్న పోస్ట్ అది. అందులో సితార ఏం రాసిందంటే.. “ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. నా పేరుతో ఎన్నో ఫేక్, స్పామ్ అకౌంట్లు పుట్టుకొచ్చాయని నా దృష్టికి వచ్చింది. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే..

నకిలీ ఖాతాల సమస్య

నేను ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రమే యాక్టివ్ గా ఉంటాను. నా అఫీషియల్ అకౌంట్ ఇదొక్కటే. ఇదొక్క మీడియం నుంచే నేను కనెక్ట్ అవుతాను. ఏ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో నాకు అకౌంట్లు లేవు. నా పేరుపై ఉన్న ఇతర అకౌంట్లతో మీరు ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోవద్దు. అలాంటివాటితో జాగ్రత్త” అని సితార పోస్ట్ చేసింది.

సితారకు ఇన్‌స్టాగ్రామ్ లో sitaraghattamaneni అనే పేరుతో అకౌంట్ ఉంది. ఇది వెరిఫైడ్ అకౌంట్. ఇందులో ఆమెకు ఏకంగా 2.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. తరచూ ఇన్‌స్టాలో తన ఫొటోలు, వీడియోలను ఆమె పోస్ట్ చేస్తూ ఉంటుంది. తల్లి, తండ్రిలాగే సితార కూడా చాలా అందంగా ఉంటుంది.

సితార యొక్క అధికారిక సోషల్ మీడియా ప్రెజెన్స్

దీంతో ఆమె అకౌంట్ ను ఫాలో అయ్యే అభిమానులు కూడా ఎక్కువే. ఓ సెలబ్రిటీ కూతురు, అందులోనూ ఇప్పటి వరకూ ఇండస్ట్రీలోకి రాని వ్యక్తికి ఈ స్థాయి ఫాలోవర్లు మామూలు విషయం కాదు. తన డ్యాన్స్, విదేశీ టూర్లు, అన్న గౌతమ్ తో ఉన్న ఫొటోలు, వీడియోలను సితార ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది.

అభిమానులతో నేరుగా సంభాషించాలని సితార కోరుకుంటుంది. నకిలీ ఖాతాల ద్వారా మోసపోకుండా జాగ్రత్త వహించాలని ఆమె విజ్ఞప్తి చేసింది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.