
నటుడు, యాంకర్, దర్శకుడు, నిర్మాత అయిన శివాజీ రాజా తన వ్యక్తిగత జీవితంలోని ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇటీవల వెల్లడించాడు. అది ఆయన వన్ సైడ్ లవ్ స్టోరీ…
Key Points
శివాజీ రాజా సంగీత బిజ్లానీని వన్ సైడ్ లవ్ చేశాడు.
సంగీత బిజ్లానీ ఒకప్పుడు మిస్ ఇండియా మరియు ప్రముఖ యాడ్ నటి.
సంగీత బిజ్లానీ క్రికెటర్ అజారుద్దీన్ ను పెళ్లి చేసుకుంది.
శివాజీ రాజా తన వన్ సైడ్ లవ్ గురించి ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
శివాజీ రాజా యొక్క వన్ సైడ్ లవ్
Sivaji Raja : నటుడిగా, యాంకర్ గా, దర్శకుడిగా, నిర్మాతగా శివాజీరాజా అందరికి పరిచయమే. ఒకప్పుడు టీవీ షోలు, సినిమాలు వరుసగా చేస్తూ బిజీగా ఉన్న శివాజీరాజా ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. చాన్నాళ్ల తర్వాత శివాజీ రాజా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర అంశాలు తెలిపాడు.
ఈ క్రమంలో శివాజీరాజా తన వన్ సైడ్ లవ్ స్టోరీ గురించి తెలిపాడు.
సంగీత బిజ్లానీ ఎవరు?
శివాజీ రాజా మాట్లాడుతూ.. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి బాంబేలో ఉంటుంది. ఆమె కూడా సినీ పరిశ్రమనే. వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ లో నటించిన సంగీత బిజ్లానీ. ఆ యాడ్ చూసే ఆమెని లవ్ చేశాను. ఆమె అంటే నాకు ఇష్టం. పెళ్ళికి ముందు నా రూమ్ లో అన్ని ఆమె పోస్టర్స్ ఉండేవి. సంగీత బిజ్లానీ విషయం మా ఆవిడకు తెలిసినప్పటి నుంచి ఆమె అంటే మా ఆవిడకు పడదు. సంగీత బిజ్లానీని కలవలేనేమో అనుకున్నాను కానీ ఒక్కసారి కలిసాను. ఆమె క్రికెటర్ అజారుద్దీన్ ని పెళ్లి చేసుకుంది. క్రికెటర్ వేంకటపతి రాజు నాకు కజిన్. నేను, వేంకటపతి రాజు హైదరాబాద్ తాజ్ బంజారాలో ఒక పెళ్ళికి వెళ్తే అక్కడికి సంగీత బిజ్లానీ వచ్చింది. వెంకటపతికి చెప్తే నేను పరిచయం చేస్తా అని తీసుకెళ్లి పరిచయం చేసాడు. హాయ్ అంటే హాయ్ అని మాట్లాడాను అంతే. అప్పటికే నాకు పెళ్లయి పిల్లలు ఉన్నారు అని చెప్పుకొచ్చాడు.
క్రికెట్ మరియు సినిమా ప్రపంచాల మధ్య సంబంధం
సంగీత బిజ్లానీ 1980 లో మిస్ ఇండియా గెలిచింది. నిర్మా యాడ్ తో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత అనేక యాడ్స్ తో పాటు హీరోయిన్ గా బాలీవుడ్ లో సినిమాలు చేసింది. అజారుద్దీన్ ని 1996 లో పెళ్లి చేసుకోగా 2010 లో విడాకులు తీసుకుంది.
శివాజీ రాజా గురించి ఈ ఆసక్తికరమైన విషయం తెలుసుకుని చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన గత జీవితం గురించి తెలిసిన విషయాలు మనల్ని ఆలోచింపజేస్తాయి.


