
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తన లేటెస్ట్ మూవీ మదరాసి ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. గెస్ట్ రోల్ కోసం తన ఎంపిక జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పడం విశేషం.
Key Points
శివకార్తికేయన్ తన సినిమాలో గెస్ట్ రోల్ లో జూనియర్ ఎన్టీఆర్ ని కోరుకుంటున్నాడు.
మదరాసి సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది.
రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో కూడా రుక్మిణి నటిస్తోంది.
మదరాసి సినిమా ప్రమోషన్స్
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ( Sivakarthikeyan ) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మదరాసి ( Madarasi Movie ). ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా యాక్ట్ చేసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో హీరోయిన్ రుక్మిణి వసంత్‌తో కలిసి శివకార్తికేయన్ ప్రమోషన్స్‌కు హాజరయ్యాడు.
గెస్ట్ రోల్ ఈ సందర్భంగా హీరోకు ఓ ప్రశ్న ఎదురైంది. మదరాసి మూవీలో గెస్ట్ రోల్ ఉన్నట్లయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ హీరోను పెట్టుకుంటారు? అని యాంకర్ సుమ అడిగింది. అందుకు శివకార్తికేయన్ ఓ క్షణం ఆలోచించి.. జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR ) అని బదులిచ్చాడు. మరోవైపు రుక్మిణి.. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ ప్రారంభమైందని తెలిపింది. ఇక మదరాసి విషయానికి వస్తే.. విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్
ఎన్టీఆర్‌తో మదరాసి హీరోయిన్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్). రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ప్ర శాంత్ నీల్ .. ‘కేజీఎఫ్’లో ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్’, ‘సలార్’లో ఖాన్సార్ ప్రాంతాలు క్రియేట్ చేసినట్లు ‘డ్రాగన్’ మూవీలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని సమాచారం. ఈ మూవీకి ఇంటర్‌నేషనల్ టచ్ ఉంటుందని భోగట్టా! గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.
డ్రాగన్ సినిమా వివరాలు
శివకార్తికేయన్ మదరాసి సినిమా ప్రమోషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ను గెస్ట్ రోల్ కోసం కోరుకున్న విషయం ఆసక్తికరంగా ఉంది. రుక్మిణి వసంత్ నటించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.


