|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాబోయే భర్తను చంపి.. సోషల్ మీడియాలో మొసలి కన్నీరు! సియా గోయల్ షాకింగ్ వీడియో

Published: 23-06-2026, 4:33 PM
కాబోయే భర్తను చంపి.. సోషల్ మీడియాలో మొసలి కన్నీరు! సియా గోయల్ షాకింగ్ వీడియో
  • కాబోయే భర్త కేతన్ విశాల్‌ను పూణెలోని లోహగడ్ కోట వద్ద సియా గోయల్ హత్య చేసింది.
  • పెళ్లి ఇష్టం లేక ప్రియుడితో కలిసి కేతన్‌ను లోయలోకి తోసేసింది.
  • హత్య తర్వాత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెట్టి మొసలి కన్నీరు కార్చింది.
  • సియా చేసిన డ్రామా వీడియోలు, పోస్టులు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

పూణెలో జరిగిన సంచలన హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాబోయే భర్త కేతన్ విశాల్‌ను హత్య చేసిన సియా గోయల్, ఆ తర్వాత సోషల్ మీడియాలో మొసలి కన్నీరు కార్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి ఇష్టం లేక చేసిన ఈ ఘాతుకం, ఆమె సోషల్ మీడియా డ్రామా ఇప్పుడు వైరల్‌గా మారింది.

హత్య వెనుక అసలు నిజం

పూణెలోని లోహ‌గ‌డ్ కోట వ‌ద్ద 25ఏళ్ల కేత‌న్ విశాల్ అనే యువ‌కుడిని కాబోయే భార్య సియా గోయ‌ల్ హ‌త్య చేయ‌డం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట కాలుజారి కింద‌ప‌డ్డాడ‌ని న‌మ్మించగా పోలీసుల‌కు అనుమానం రావ‌డంతో విచార‌ణ‌లో సంచ‌ల‌న నిజాలు వెలుగు చూశాయి. పెళ్లి ఇష్టంలేక త‌న ప్రియుడు చేత‌న్ చౌద‌రితో క‌లిసి సియా కాబేయే భ‌ర్త కేత‌న్ ను లోయ‌లోకి తోసేసింది. దీంతో అక్క‌డికక్క‌డే కేత‌న్ ప్రాణాలు కోల్పోయాడు. ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపిన పోలీసులు సియా ఫోన్ కాల్స్ ఆధారంగా ఇది హ‌త్యేన‌ని నిర్దారించి ఆమెతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో సియా డ్రామా

అయితే కేత‌న్ ను చంపిన త‌ర‌వాత ఎవ‌రికీ అనుమానం రాకుండా సియా సోష‌ల్ మీడియాలో మొస‌లి క‌న్నీరు కార్చ‌డం అందరినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. త‌న పుట్టిన రోజు కోసం సియా చేత‌న్‌ను లోహ‌గ‌డ్ కోట వ‌ద్ద‌కు తీసుకువెళ్లగా అక్కడ వాళ్లిద్దరూ సరదాగా గడిపిన వీడియోలను సియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. త‌న పోస్టులో ఎంతో ఆవేద‌న చెందుతున్న‌ట్టు రాసుకొచ్చింది.

నెటిజన్ల ఆగ్రహం, పోలీసుల విచారణ

నా పుట్టిన‌రోజునే నువ్వు దూరం అవ్వ‌డం, మ‌న పెళ్లికి ద‌గ్గ‌ర‌పడుతుంటే నువ్వు దూరం అవ్వ‌డం, నువ్వు ఎందుకు ఇలా చేశావో నాకు అర్థం కావ‌డంలేదు. నేను నీతో జీవితం కోసం ఎన్నో క‌ల‌లు క‌న్నాను. నేను నిన్ను ఎంత‌గానో ప్రేమిస్తుంటే నువ్వు న‌న్ను ఎలా విడిచిపెట్టి వెళ్లావు.. అంటూ రాసుకొచ్చింది. అయితే తానే చంపి ఎవ‌రికీ అనుమానం రాకుండా సియా చేసిన పోస్టులు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. దీంతో నెటిజ‌న్లు ఆమెపై మండిప‌డుతున్నారు.

ఈ ఘటన సమాజంలో నైతిక విలువల పతనాన్ని, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని స్పష్టం చేస్తుంది. నేరస్తులకు కఠిన శిక్ష పడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.