|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Smriti Irani : మళ్లీ బుల్లితెరపైకి కేంద్ర మాజీ మంత్రి.. 25 ఏళ్ళ తర్వాత అదే పాత్రతో.. ఫస్ట్ లుక్ లీక్..

Published: 07-07-2025, 8:10 AM
Smriti Irani : మళ్లీ బుల్లితెరపైకి కేంద్ర మాజీ మంత్రి.. 25 ఏళ్ళ తర్వాత అదే పాత్రతో.. ఫస్ట్ లుక్ లీక్..

కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ మళ్ళీ బుల్లితెరపై కనిపించబోతున్నారు. దాదాపు 12 ఏళ్ళ తర్వాత ‘క్యూన్కి సాస్ బి కభీ బహు తీ’ సీరియల్ సీక్వెల్ లో ఆమె నటించనున్నారు. ఈ సీరియల్ లో ఆమె తులసి పాత్రను పోషించారు.

స్మృతి ఇరానీ బుల్లితెరకు తిరిగి

Smriti Irani : సినీ,టీవీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు చాలామంది రాజకీయాల్లో రాణిస్తున్నారు. వారిలో స్మృతి ఇరానీ ఒకరు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి నటిగా మారి బాలీవుడ్ లో అనేక సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకుంది స్మృతి ఇరానీ. పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. తెలుగులో జై బోలో తెలంగాణ సినిమాలో కూడా నటించింది. రాజకీయాల్లో బిజీ అయ్యాక సినిమాలు, సీరియల్స్ కు దూరమయింది.

బీజీపీలో చేరి మహిళా నాయకురాలిగా ఎదిగి ఎంపీ అయి కేంద్రమంత్రివర్గంలో పని చేసారు స్మృతి ఇరానీ. దాదాపు 10 ఏళ్ళ పాటు కేంద్రమంత్రిగా వివిధ శాఖలకు పనిచేసారు. 2009 నుంచే సీరియల్స్ తగ్గించేసినా 2013తో పూర్తిగా బుల్లితెరకు దూరమయింది స్మృతి ఇరానీ. ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ బుల్లితెరపై కనిపించబోతుంది.

‘క్యూన్కి సాస్ బి కభీ బహు తీ’ సీక్వెల్

ఒకప్పటి సూపర్ హిట్ బాలీవుడ్ సీరియల్ ‘క్యూన్కి సాస్ బి కభీ బహు తీ’ కి సీక్వెల్ రాబోతుంది. ఈ సీరియల్ లో గతంలో స్మృతి ఇరానీ మెయిన్ లీడ్ తులసి పాత్ర పోషించింది. ఇప్పుడు రాబోయే సీక్వెల్ లో మళ్ళీ అదే తులసి పాత్రతో బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది స్మృతి ఇరానీ.

ఫస్ట్ లుక్ మరియు తదుపరి ప్రణాళికలు

ప్రస్తుతం ఈ సీరియల్ షూటింగ్ దశలో ఉన్నట్టు సమాచారం. ఈ సీరియల్ నుంచి తాజాగా స్మృతి ఇరానీ ఫస్ట్ లుక్ లీక్ అయింది. ఈ లుక్ లో పక్కా బాలీవుడ్ సీరియల్ పాత్ర లాగే కనిపించారు. అయితే గతంలో ఈ సీరియల్ తనమీదే నడిచింది కాబట్టి ఈ ఒక్క సీరియల్ మాత్రమే నటిస్తుందని సమాచారం. స్మృతి ఇటు సీరియల్ చేస్తూనే అటు రాజకీయాల్లో కూడా ఎప్పటిలాగే యాక్టివ్ గా ఉంటుందని తెలుస్తుంది.

స్మృతి ఇరానీ రాజకీయాలతో పాటు నటనలోనూ కొనసాగుతారని తెలుస్తోంది. ఈ సీరియల్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.