|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఐశ్వర్యారాయ్ కి స్నేహా ఉల్లాల్ సారీ చెప్పడానికి అసలు కారణం ఇదేనా? వైరల్ న్యూస్!

Published: 21-03-2026, 3:05 AM
షాకింగ్: ఐశ్వర్యారాయ్ కి స్నేహా ఉల్లాల్ సారీ చెప్పడానికి అసలు కారణం ఇదేనా? వైరల్ న్యూస్!
  • స్నేహా ఉల్లాల్ ఐశ్వర్యారాయ్‌ను కలిసి సారీ చెప్పడానికి గల కారణం బయటపెట్టిన షాకింగ్ నిజం!
  • సల్మాన్ ఖాన్ ‘లక్కీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్.
  • ఐశ్వర్య రాయ్ పోలికల గురించి మీడియాలో వచ్చిన వార్తలకు స్నేహా ఉల్లాల్ వివరణ.
  • ప్రస్తుతం నీలకంఠ సినిమాలో నటిస్తున్న స్నేహా ఉల్లాల్, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాలీవుడ్ మరియు బాలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తూ స్నేహా ఉల్లాల్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. ఐశ్వర్య రాయ్‌ను కలిసి ఆమెకు సారీ చెప్పడానికి గల కారణాన్ని తెలుసుకొని షాక్ అవ్వండి.

ఐశ్వర్యారాయ్‌తో స్నేహా ఉల్లాల్ క్షమాపణలు

బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలో మెరిపించిన హీరోయిన్ స్నేహా ఉల్లాల్. 2005లో వచ్చిన ‘లక్కీ: నో టైమ్ ఫర్ లవ్’ సినిమాలో సల్మాన్ ఖాన్ పక్కన నటించిన హీరోయిన్ ..ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ నటన కన్నా ఎక్కువగా, ఆమె అచ్చం ఐశ్వర్య రాయ్ లా ఉందనే పోలికలతోనే రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయింది.

రీసెంట్ గా తన మొదటి సినిమా రిలీజై దాదాపు 21 ఏళ్లు అయిన సందర్భంలో.. స్నేహా ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టింది. బాలీవుడ్‌లోకి వచ్చిన కొన్నాళ్లకే ఆమె ఒకసారి ఐశ్వర్య రాయ్‌ను కలిశారట. అప్పుడు ఆమెకు స్నేహం సారి చెప్పిందట. దానికి కారణం ఏంటో తెలుసా?

సల్మాన్ ఖాన్‌తో స్నేహా ఉల్లాల్ అనుభవాలు

స్నేహా ఎంట్రీ ఇచ్చిన సమయంలో మీడియాలో ఇద్దరి పోలికల గురించి తెగ వార్తలు వచ్చేవి. అది చూసి స్నేహాకు చాలా ఇబ్బందిగా, మొహమాటంగా అనిపించిందట. ఐశ్వర్యను ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు, స్నేహా మెల్లగా “సారీ, నన్ను ద్వేషించకండి” అని చెప్పింది. దానికి ఐశ్వర్య రాయ్ చాలా హుందాగా స్పందించి, “బాలీవుడ్ ఫ్యామిలీకి వెల్కమ్” అని చెప్పిందట.

అసలు తనకు ఈ సినిమా అవకాశం ఎలా వచ్చిందో కూడా స్నేహా గుర్తుచేసుకుంది. ఆమె కాలేజీకి వెళ్తున్న రోజుల్లో, సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ ఫ్రెండ్స్ స్నేహాను చూశారట. వాళ్ల ద్వారానే ఆడిషన్ అవకాశం వచ్చి, సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది.నిజానికి తనకు మొదటి నుంచి నటి అవ్వాలనే కోరిక లేదని స్నేహా చెప్పింది. “నేను అప్పుడు కాలేజీలో ఉన్నాను. ఆ టైంలో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ అయి చాలా పాపులర్. చుట్టుపక్కల వాళ్లందరూ నన్ను ‘నువ్వు ఐశ్వర్య రాయ్‌లా ఉన్నావ్’ అనేవాళ్లు. దాంతో నాకు కొంచెం ఫేమ్ వచ్చింది” అని ఆమె చెప్పింది.

స్నేహా ఉల్లాల్ సినీ కెరీర్ విశేషాలు

ఐశ్వర్యలా ఉండటం వల్లే సల్మాన్ ఖాన్ తనను సెలెక్ట్ చేశాడని వచ్చిన వార్తలను స్నేహా కొట్టిపారేసింది. “అదంతా కేవలం పీఆర్ వాళ్లు చెప్పిన మాటలు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. ఆ పోలికల వల్ల నాకు లాభం జరగలేదు, నష్టమూ జరగలేదు” అని స్పష్టం చేసింది. ఇక సల్మాన్‌తో పనిచేసిన అనుభవాన్ని కూడా స్నేహా పంచుకుంది. “ఆయన నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. చాలా ఓపికగా ఉంటూ, నాకు హెల్ప్ చేశారు” అని చెప్పింది. ప్రస్తుతం స్నేహా ఉల్లాల్ “నీలకంఠ” అనే తెలుగు సినిమాలో నటిస్తోంది.

స్నేహా ఉల్లాల్ ఒమన్‌లోని మస్కట్‌లో పుట్టింది. ఆమె తండ్రి మంగళూరుకు చెందిన తులు దేవాడిగ, తల్లి సింధీ. మస్కట్, సలాలాలోని ఇండియన్ స్కూల్స్‌లో చదివింది. తర్వాత తల్లితో కలిసి ముంబైకి వచ్చి, డురెలో కాన్వెంట్ హైస్కూల్, వర్తక్ కాలేజీలో చదువుకుంది. 17 ఏళ్ల వయసులో ‘లక్కీ’ సినిమాతో సల్మాన్ పక్కన హీరోయిన్‌గా మారింది. తర్వాత సోహైల్ ఖాన్‌తో ‘ఆర్యన్’ సినిమాలో, కొన్ని తెలుగు సినిమాల్లో నటించినా.. ఏవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.

స్నేహా ఉల్లాల్ యొక్క ఈ షాకింగ్ విషయాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.