
📌 Key Points
- మాస్టర్ మహేంద్రన్ హీరోగా, స్నేహ ఉల్లాల్ కీలక పాత్రలో ‘నీలకంఠ’ తెరకెక్కింది.
- విలేజ్ యాక్షన్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రం జనవరి 2న విడుదల కానుంది.
- దర్శకుడు రాకేష్ మాధవన్ మొదటి సినిమా ఇది; చివరి 20 నిమిషాలు ఆసక్తికరంగా ఉంటాయట.
- ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మాస్టర్ మహేంద్రన్, స్నేహ ఉల్లాల్ కీలక పాత్రల్లో తెరకెక్కిన ‘నీలకంఠ’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. విలేజ్ యాక్షన్ కథాంశంతో జనవరి 2న విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
నీలకంఠ: స్నేహ ఉల్లాల్ రీ-ఎంట్రీ విశేషాలు
Nilakanta : ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా యష్నా చౌదరి, నేహా పఠాన్ హీరోయిన్ గా స్నేహ ఉల్లాల్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా నీలకంఠ. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాకేష్ మాధవన్ దర్శకత్వంలో విలేజ్ యాక్షన్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 2న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు.(Nilakanta)
నీలకంఠ ట్రైలర్ చూసేయండి..
మాస్టర్ మహేంద్రన్ పాత్ర & కథా నేపథ్యం
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత మర్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ.. నేను ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుంచి సినిమా అంటే ప్యాషన్ తో నిర్మాణంలోకి వచ్చాను. రాకేష్ మాధవన్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథ తప్పకుండా సినిమా అచేయాలని నీలకంఠ ప్రారంభించాం. షూటింగ్ టైమ్ లో ప్రకృతి సహకరించక, కొన్నిసార్లు తుఫాన్ లు ఎదుర్కొని షూటింగ్ లు ఆపేసి, అవాంతరాలు దాటుకుని ఈ సినిమాని తీసుకొస్తున్నాం అన్నారు.
డైరెక్టర్ రాకేష్ మాధవన్ మాట్లాడుతూ.. చాలా షార్ట్ ఫిలింస్ చేసిన తర్వాత ఫీచర్ ఫిలిం చేయాలనే కోరిక నిజమవుతోంది. ఇది దర్శకుడిగా నా మొదటి సినిమా. ట్రైలర్ చూసిన వాళ్లు కొత్త దర్శకుడు చేసినట్లు లేదు అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సినిమా చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోకుండా ఉంటుంది. మనం చేసిన మంచి చిత్రాన్ని కూడా ఇతర భాషలకు చూపించాలనే పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం అన్నారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైలైట్స్
హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. నేను తెలుగువాడినే. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో నటించాను. తెలుగు ఆడియెన్స్ సినిమాను ఎంత ప్రేమిస్తారో తెలుసు. అందుకే తెలుగు ఫిలింమేకర్స్ ఎవరైనా స్క్రిప్ట్ పంపిస్తే చదివేస్తుంటా. నాకు కంటెంట్ ఉన్న మూవీస్ చేయడం ఇష్టం. చేయని తప్పుకు ఊరు ఊరంతా తన మీద నింద మోపితే హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనే కథాంశంతో ఆసక్తికరంగా ఉంటుంది ఈ సినిమా అని తెలిపాడు.
దర్శకుడి తొలి ప్రయత్నం, హీరో మహేంద్రన్ నటన, స్నేహ ఉల్లాల్ రీ-ఎంట్రీతో ‘నీలకంఠ’పై ఆసక్తి పెరుగుతోంది. జనవరి 2న విడుదల కానున్న ఈ సినిమా ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.


