|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అక్కినేని కోడలు తల్లి కాబోతోందా? శోభిత ప్రెగ్నెన్సీపై క్లారిటీ వచ్చేసింది!

Published: 20-03-2026, 12:05 PM
అక్కినేని కోడలు తల్లి కాబోతోందా? శోభిత ప్రెగ్నెన్సీపై క్లారిటీ వచ్చేసింది!
  • శోభిత, నాగచైతన్య 2024 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు.
  • శోభిత గర్భవతి అని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది.
  • గద్దర్ ఫిలిం అవార్డు వేడుకలలో నాగచైతన్యతో కలిసి శోభిత సందడి చేశారు.
  • శోభిత ప్రస్తుతం తన కెరీర్‌పై దృష్టి సారించారని తెలుస్తోంది.

శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్యల వివాహం తర్వాత ఆమె గర్భవతి అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, గద్దర్ ఫిలిం అవార్డు వేడుకలో నాగచైతన్యతో కలిసి కనిపించడంతో ఆ వార్తలకు పుల్ స్టాప్ పడింది.

శోభిత, నాగచైతన్యల వివాహం

Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ్ల పరిచయం అవసరం లేని పేరు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ సినిమాల ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ సిరీస్ లలో కూడా నటించిన ఈమె ఇటీవల తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇకపోతే శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) అక్కినేని ఇంటి కోడలు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈమె నటుడు నాగచైతన్య(Nagachaitanya)ను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 2024 డిసెంబర్లో ఎంతో ఘనంగా జరిగింది. ఇక శోభిత నాగచైతన్యకు రెండో భార్య అనే సంగతి మనకు తెలిసిందే.

శోభిత నాగచైతన్య వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇకపోతే గత కొద్ది రోజులుగా శోభిత ప్రెగ్నెన్సీ (Pregency)వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈమె తల్లి కాబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఈ వార్తలకు అనుగుణంగానే నాగార్జున కూడా ఒక కార్యక్రమంలో పరోక్షంగా ఈ వార్తలో నిజమేనన్నట్టు మాట్లాడారు. దీంతో శోభిత ప్రెగ్నెన్సీ గురించి వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలకు అనుగుణంగానే ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో జరిగిన పెళ్లి వేడుకలకు కూడా శోభిత దూరంగా ఉన్నారు.

వైరల్ అవుతున్న ప్రెగ్నెన్సీ వార్తలు

విరోష్ పెళ్లి వేడుకలలోనూ అలాగే అల్లు శిరీష్ పెళ్లి వేడుకలలో నాగచైతన్య నాగార్జున అమలతో కలిసి కనిపించారు కానీ శోభిత మాత్రమే ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈమె నిజంగానే తల్లి కాబోతున్నారంటూ అభిమానులు సంతోషపడ్డారు. అయితే తన ప్రేగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని శోభిత చెప్పకనే చెప్పేశారు. గద్దర్ ఫిలిం అవార్డు(Gaddar Film Award) వేడుకలలో నాగచైతన్యత కలిసి సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో శోభిత బేబీ బంప్ ఎక్కడ కనిపించలేదు . ఉల్లిపొర లాంటి చీరలో అందాలన్నింటినీ బయట పెడుతూ శోభిత సందడి చేశారు దీంతో ఈమె ప్రెగ్నెన్సీ వార్తలకు కూడా చెక్ పెట్టినట్టు అయింది.

గద్దర్ అవార్డులలో శోభిత సందడి..

గద్దర్ అవార్డులలో శోభిత సందడి

ఇలా శోభిత ప్రెగ్నెంట్ అంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని ఈమె ప్రస్తుతం కెరియర్ పైనే దృష్టి సారించారని తెలుస్తోంది. ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. కెరియర్ పరంగా పలు ప్రాజెక్టులకు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు. మరోవైపు నాగచైతన్య సైతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తండేల్ సినిమాతో సక్సెస్ అందుకున్న నాగచైతన్య ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన వృషకర్మ అని సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

మొత్తానికి శోభిత ధూళిపాళ్ల గర్భవతి అనే వార్తలకు చెక్ పడింది. ఆమె తన కెరీర్‌పై దృష్టి సారించారని స్పష్టమవుతోంది. త్వరలో మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.