|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కాంచన్ కుమారి దారుణ హత్య- అందుకే చంపానంటూ కిల్లర్ వీడియో- ఇద్దరు అరెస్ట్!

Published: 14-06-2025, 2:24 AM
సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కాంచన్ కుమారి దారుణ హత్య- అందుకే చంపానంటూ కిల్లర్ వీడియో- ఇద్దరు అరెస్ట్!

పంజాబ్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కాంచన్ కుమారి దారుణంగా హత్య చేయబడింది. ఆమె హత్యకు సంబంధించిన వీడియోను నిందితుడు విడుదల చేయడంతో కలకలం రేగుతోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Key Points

1

పంజాబ్ ఇన్ఫ్లూయెన్సర్ కాంచన్ కుమారి దారుణ హత్య.

2

కిల్లర్ అమృత్ పాల్ సింగ్ హత్యకు కారణాన్ని వివరిస్తూ వీడియో విడుదల.

4

ప్రధాన నిందితుడు అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్నాడు.

కాంచన్ కుమారి హత్య

పంజాబ్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కాంచన్ కుమారి దారుణ హత్యకు గురైంది. సోషల్ మీడియాలో కమల్ కౌర్ బాబీగా బాగా పేరొందిన కాంచన్ కుమారి (30) బోల్డ్ కంటెంట్‌తో సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు చేసేది. ఇన్‌స్టాగ్రామ్‌ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న కాంచన్ కుమారి తన పోస్టులతో వివాదాలు కూడా ఎదుర్కొంది.

అయితే, పంజాబ్‌లోని బటిండాలో బుధవారం (జూన్ 11) రాత్రి ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేసిన ఓ కారులో కాంచన్ కుమారి శవమై కనిపించింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ హత్యను అమృత్ పాల్ సింగ్ గ్యాంగ్ చేసినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన వీడియోను అమృత్ పాల్ సింగ్ రిలీజ్ చేశాడు.

ఆ వీడియోలో కాంచన్ కుమారి సోషల్ మీడియా లో అసభ్య కంటెంట్ (బోల్డ్) పోస్ట్ చేస్తుందని, అందుకు ఇది శిక్షగా చేసిన చర్య అని అమృత్ పాల్ సింగ్ చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, కమల్ కౌర్ బాబీ హత్య కేసు చేధించిన పోలీసులు ఇద్దరు నిహాంగ్లను శుక్రవారం (జూన్ 13) అరెస్ట్ చేశారు.

కిల్లర్ వీడియో వైరల్

కాంచన్ కుమారి హత్య కేసులో జస్‌ప్రీత్ సింగ్, నిమ్రత్ జిత్ సింగ్‌లను అరెస్ట్ చేసినట్లు పంజాబ్ పోలీసులు వెల్లడించారు. అయితే, ప్రధాన నిందితుడు సిక్కు రాడికల్ నాయకుడు అమృత్ పాల్ సింగ్ మెహ్రాన్ పరారీలో ఉన్నాడని, అతనికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమ్‌నీత్ కొండల్ తెలిపారు.

కాంచన్ కుమారిని గొంతు నులిమి చంపారని, అనధికారిక మోరల్ పోలీసింగ్ ఫలితమే ఈ దారుణానికి కారణం అని ఎస్ఎస్పీ తెలిపారు. కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీసే అనైతిక కంటెంట్‌ను అప్‌లోడ్ చేసినందుకు కాంచన్‌ను చంపినట్లు అరెస్టయిన నిందితులు ప్రాథమిక విచారణలో తెలిపారు.

బిజినెస్ మీటింగ్ నెపంతో అమృత్ పాల్ సింగ్ మెహ్రాన్ గత వారం కాంచన్‌ను సంప్రదించాడని, పెయిడ్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమెను బటిండాకు ఆహ్వానించాడని ఎస్ఎస్పీ పేర్కొన్నారు.

ఇద్దరు నిందితుల అరెస్టు

జూన్ 9న మధ్యాహ్నం 3.30 గంటలకు లూథియానాలోని తన ఇంటి నుంచి జస్‌ప్రీత్, నిమ్రత్‌ జిత్‌తో కలిసి బయలుదేరిన కాంచన్‌ను కొన్ని గంటల తర్వాత కారులో నడుము బ్యాండ్‌తో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇక పోతే బటిండా-చండీగఢ్ హైవేపై యూనివర్సిటీ స్థలంలో పార్క్ చేసిన కారు నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు వచ్చి వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు 30 నుంచి 35 ఏళ్ల మహిళ మృతదేహం కనిపించింది. అది సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కాంచన్ కుమారి అని పోలీలుసు నిర్ధారించుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కాంచన్ కుమారి హత్య కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు, కానీ ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.