|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘సన్‌ ఆఫ్ సర్దార్-2’ నుంచి రేబియా పోస్టర్ రిలీజ్.. ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న స్టార్ బ్యూటీ

Published: 17-07-2025, 12:06 AM
‘సన్‌ ఆఫ్ సర్దార్-2’ నుంచి రేబియా పోస్టర్ రిలీజ్.. ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న స్టార్ బ్యూటీ

అజయ్ దేవగన్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్-2’ చిత్రం నుండి మృణాల్ ఠాకూర్ పోస్టర్ విడుదలైంది. ఆమె రేబియా పాత్రలో ట్రెడిషనల్ లుక్‌లో అందంగా కనిపిస్తోంది. ఇతర నటీనటుల పాత్రలు కూడా వెల్లడించారు.

Key Points

1

మృణాల్ ఠాకూర్ 'రేబియా'గా ట్రెడిషనల్ లుక్‌లో అద్భుతంగా కనిపించారు.

2

‘సన్ ఆఫ్ సర్దార్-2’ చిత్రం జూలై 25న విడుదల కానుంది.

4

చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిన పోస్టర్స్‌లో నటీనటుల పాత్రలు వెల్లడించబడ్డాయి.

మృణాల్ ఠాకూర్ ట్రెడిషనల్ లుక్

బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్‌గ‌ణ్(Ajay Devgan) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్-2’ (Son Of Sardaar 2). విజ‌య్ కుమార్ అరోరా(Vijay Kumar Arora) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి(SS Rajamouli) ద‌ర్శ‌క‌త్వంలో సునీల్(Sunil) హీరోగా వ‌చ్చిన మర్యాద రామన్న(Maryada Ramanna) సినిమాను హిందీలో సన్ ఆఫ్ సర్దార్ (Son Of Sardaar) అని రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమాకు సన్ ఆఫ్ సర్దార్ 2 అంటూ సీక్వెల్‌ను తీసుకువ‌స్తున్నారు మేక‌ర్స్.

‘సన్ ఆఫ్ సర్దార్-2’ విడుదల తేదీ

ఇప్ప‌టికే ఫ‌స్ట్‌లుక్‌తో పాటు గ్లింప్స్‌, ట్రైలర్ చేసిన చిత్ర‌యూనిట్ తాజాగా మృణాల్ పోస్టర్‌‌తో పాటు మరికొంత మంది యాక్టర్స్ వారు పోషిస్తున్న పాత్రలను రివీల్ చేసింది. అందులో మృణాల్ రేబియాగా, రవి కిషన్ రాజాగా, ముకుల్ దేవ్ టోనీగా, సంజయ్ మిశ్రా బంటు పాండేగా, చున్కీ పాండే దానిష్‌గా, వింద్ దారా సింగ్ టిట్టుగా, శరత్ సక్సేనా రంజిత్ సింగ్‌గా, కుబ్రా సైట్ మెహ్విష్‌గా, నీరు బాజ్వా డింపుల్‌గా, దీపక్ దాబ్రియల్ గుల్‌గా, రోష్నివాలియా సాబాగా, అశ్విని కల్శేకర్ ప్రేమ్‌లతాగా, సాహిల్ మెహతా గొగ్గిగా కనిపించనున్నారు.

నటీనటుల పాత్ర వివరాలు

ఇక చివరిలో అందరూ ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. ‘ఇది ఫ్యామిలీ ఫొటో కాదు.. బాంబ్ పేలడానికి ముందు తీసుకున్న సీన్’ అని రాసుకొచ్చారు. అయితే ఈ మొత్తం పోస్టర్స్‌లో మృణాల్ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ట్రెడిషనల్ వేర్‌లో చాలా అందంగా కనిపించింది. గోల్డెన్ కలర్ లెహంగా వేసుకుని ఎంతగానో ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాను జూలై 25న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే.

మొత్తంమీద, ‘సన్ ఆఫ్ సర్దార్-2’ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. మృణాల్ ఠాకూర్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జూలై 25న విడుదలయ్యే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.