
📌 Key Points
- సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా ‘సన్ ఆఫ్’ (S/O) చిత్రం తెరకెక్కుతోంది.
- టీజర్‌లో కొడుకు తండ్రిపై కోర్టులో కేసు వేసిన సన్నివేశాలు హైలైట్.
- సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించగా, బత్తల సతీష్ దర్శకత్వం వహించారు.
- ఇది తండ్రి-కొడుకుల మధ్య సాగే స్క్రీన్ ప్లే బేస్డ్ కథ అని నటులు, దర్శకుడు వివరించారు.
సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా తెరకెక్కిన ‘సన్ ఆఫ్’ (S/O) సినిమా టీజర్ విడుదలైంది. తండ్రి మీద కొడుకు కేసు వేయడం అనే సంచలన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం టీజర్ ఆకట్టుకుంటోంది. వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.
టీజర్‌లో తండ్రి-కొడుకు వివాదం
Son Of Teaser : సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ పై సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా ‘సన్ ఆఫ్’ (S/O). బత్తల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.(Son Of Teaser)
ఈ టీజర్ చూస్తుంటే ఓ గాలికి తిరిగే కొడుకుని తండ్రి తిడుతుండటం, కొడుతుండటం చేయగా కొడుకు తండ్రి మీద కోపంతో కోర్ట్ లో కేసు వేసినట్టు తెలుస్తుంది. మరి ఏం కేసు వేసాడు? ఎందుకు వేసాడు తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే. సన్ ఆఫ్ టీజర్ మీరు కూడా చూసేయండి..
సాయి సింహాద్రి సినిమా నేపథ్యం
టీజర్ లాంచ్ ఈవెంట్లో సీనియర్ నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. సన్ ఆఫ్ సినిమా రెగ్యులర్ సినిమా కాదు. ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా. ఓ తండ్రి, కొడుకుల మధ్య సాగే కథ ఇది. సాయి సింహాద్రి ఎక్కడో పర్లాకిమిడిలో చదివి అమెరికాకు వెళ్ళి అక్కడి నుంచి వచ్చి ఈ సినిమా తీశారు. డైరెక్టర్ సతీష్ 45 నిమిషాలు కథ బాగా నెరేషన్ చేశారు. ఈ కథ మా అబ్బాయికి కూడా చెప్పాను. నేను ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో నటిస్తున్నాను అని తెలిపారు.
వినోద్ కుమార్, డైరెక్టర్ సతీష్ ఏమన్నారంటే..
డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఆయన కెరీర్ లో ‘మామ గారు’ సినిమాలుగా నిలుస్తుంది. మా హీరో సాయి సింహాద్రి నన్ను నమ్మి అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా చేశారు. కొడుకు తండ్రి మీద ఎందుకు కేసు వేశాడు అనేది చాలా స్ట్రాంగ్ గా చూపించాం అని అన్నారు. హీరో, నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ.. ఇలాంటి కథను సినిమా తీయాలి అని ఎప్పట్నుంచో అనుకున్నాను. ఈ కథ రియల్ లైఫ్ లో నాకూ, మా నాన్నకు కూడా కనెక్ట్ అవుతుంది. ప్రతి కొడుకు తన తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది. నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయనకి ఈ సినిమా చూపించాలి అని అన్నారు.
‘సన్ ఆఫ్’ టీజర్ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. తండ్రి, కొడుకుల మధ్య బలమైన ఎమోషనల్ కథతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సాయి సింహాద్రి ఈ కథతో ఎంతగా ఆకట్టుకుంటాడో సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది.


