
📌 Key Points
- సోనాలి రౌత్ సంచలన ఆరోపణలు: బిగ్ బాస్ నిర్వాహకులపై రూ. 2 కోట్ల దావా!
- హౌస్‌లో అపరిశుభ్రత, తామర వ్యాధితో సోనాలి ఆరోగ్యం క్షీణించిందని ఆవేదన వ్యక్తం!
- కంటెస్టెంట్స్ టవల్స్, బెడ్ షీట్స్ పంచుకోవడం.. దారుణ పరిస్థితులు!
- మానసిక, శారీరక క్షోభకు గురయ్యానని సోనాలి ఎమోషనల్ కామెంట్స్!
బాలీవుడ్ మోడల్ సోనాలి రౌత్ బిగ్ బాస్ నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేసింది. తన ఆరోగ్యం క్షీణించడానికి కారణమైనందుకు రూ. 2 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపింది. ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సోనాలి రౌత్ సంచలన ఆరోపణలు!
Sonali Raut : బాలీవుడ్ మోడల్, నటి సోనాల్ రౌత్ పలు టీవీ షోలతో, కింగ్ ఫిషర్ క్యాలెండర్ తో మోడల్ గా ఫేమ్ తెచ్చుకుంది. హిందీ బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొని ఫైనల్ వరకు వెళ్లి మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఇటీవలే బిగ్ బాస్ మరాఠీ సీజన్ 6లో కూడా పాల్గొంది. కానీ ఈ సీజన్ లో రెండు వారాలకే బయటకు వచ్చేసింది సోనాలి రౌత్. అయితే తన ఆరోగ్య సమస్యల వల్లే బయటకు వచ్చినట్టు తన ఒంటిపై వచ్చిన మచ్చలు, దద్దుర్లు చూపిస్తూ ఓ సెన్సేషనల్ పోస్ట్ చేసింది.
సోనాలి రౌత్ తన పోస్ట్ లో.. రియాలిటీ షో అంటే ప్రాణాలను పణంగా పెట్టడం కాదు. మేము నిర్వాహుకులపై నమ్మకంతోనే వెళ్తాము. బిగ్ బాస్ మరాఠీ లోకి నేను అలాగే వెళ్ళాను. కానీ అక్కడ మమ్మల్ని అపరిశుభ్రత వాతావరణంలో ఉంచారు. హౌస్‌లో శుభ్రత లేకపోవడం వల్ల నాకు తామర సోకింది. వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు ఉన్నాయి. ఇతరులు వాడిన టవల్స్, రేజర్‌లు లాంటివి కూడా షేర్ చేసుకోవాల్సి వచ్చింది. హౌస్‌లో టవల్స్, బెడ్ షీట్లు, నాప్‌కిన్‌ల కొరత ఉంది. కంటెస్టెంట్స్ ఒకరి టవల్స్, బెడ్ షీట్లను మరొకరు వాడుకునేవారు. సిగరెట్స్ తాగి అక్కడే పడేసేవాళ్ళు. మిగిలిపోయిన ఆహరం ఓపెన్ ప్లేస్ లో వేయడంతో ఎలుకలు వచ్చాయి. షోలో పనిష్మెంట్ పేరుతో 17 మంది కంటెస్టెంట్స్ ని ఒకే వాష్‌రూమ్‌ను వాదమన్నారు.
అపరిశుభ్ర వాతావరణం.. ఆరోగ్య సమస్యలు!
అసలు అక్కడ ఉండలేకపోయాను. అదంతా ఒక పీడకలలా ఉంది నాకు. అలాంటి అపరిశుభ్రమైన వాతావరణం వల్లే నా ఆరోగ్యం పాడయి నేను రెండో వారంలోనే బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఆ ఎఫెక్ట్ నాకు చర్మ వ్యాధికి దారితీసింది. షో నుంచి బయటకు వచ్చాక మూడు నెలలు అయినా ఇప్పటికి నన్ను బాధిస్తుంది. ఆ సమయంలో నేను తీవ్రమైన మానసిక, శారీరక క్షోభకు గురయ్యాను అంటూ ఎమోషనల్ గా తన ఒంటిపై వచ్చిన తామరని చూపిస్తూ తెలిపింది.
బిగ్ బాస్ నిర్వాహకులకు భారీ షాక్!
అంతేకాకుండా తన ఆరోగ్యాన్ని దెబ్బతీసినందుకు, సరైన శుభ్రతా ప్రమాణాలు పాటించనందుకు, ఇలాంటి వాటిపై స్పందించనదుకు బిగ్ బాస్ నిర్వాహకులకు రెండు కోట్లు చెల్లించాలని నోటీసులు పంపించింది. అయితే దీనిపై బిగ్ బాస్ టీమ్ ఇంకా స్పందించలేదు.
సోనాలి రౌత్ ఆరోపణలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


