|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చేతులతో పాముని పట్టుకున్న సోనూ సూద్‌.. వీడియో వైరల్‌

Published: 19-07-2025, 11:12 PM
చేతులతో పాముని పట్టుకున్న సోనూ సూద్‌.. వీడియో వైరల్‌

నటుడు సోనూ సూద్ తన ఇంటిలోకి వచ్చిన పామును చేతులతోనే పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సోనూ సూద్ యొక్క ధైర్యం అందరినీ ఆకర్షించింది.

Key Points

1

సోనూ సూద్ తన చేతులతో పామును పట్టుకున్నారు.

2

పామును చూసి సిబ్బంది భయపడితే, సోనూ సూద్ చాకచక్యంగా వ్యవహరించారు.

4

ఇంటికి పాములు వస్తే నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు.

సోనూ సూద్ ధైర్యం

పాము ఉందని తెలిస్తేనే ఆమడ దూరం పరుగెడతాం . కళ్లకు కనిపిస్తే .. భయంతో వణికిపోతాం . ఇక సినిమా వాళ్లకు పాము అంటే భయం ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి . వాళ్లు రియల్ ‌ లైఫ్ ‌ లో పాములను రేర్ ‌ గా చూస్తుంటారు . చిన్న బల్లికే భయపడే స్టార్స్ ‌ చాలా మందే ఉన్నారు . కానీ ‘ రియల్ ‌ హీరో ’, నటుడు సోనూ సూద్‌(Sonu Sood ) మాత్రం పెద్ద పాముని తన చేతులతో పట్టుకున్నాడు . ఆ పాముని చూసి తన సిబ్బంది అంతా భయంతో దూరం జరిగితే .. ఆయన మాత్రం చాకచక్యంగా దాన్ని పట్టుకొని .. అడవిలో విడిపెట్టాడు . దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ ‌ అవుతుంది .

ముంబైలో సోనూ సూద్ ‌ నివాసం ఉండే సొసైటీలోకి ఈ పాము దారితప్పి వచ్చింది . పాముని చూసి అంతా భయంతో దూరంగా వెళ్లిపోయారు . సోనూ సూద్ ‌ మాత్రం ఉత్త చేతులతో దాన్ని పట్టుకొని సంచిలో బంధించాడు . అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలి పెట్టాలని తన సిబ్బందికి సూచించారు. అయితే తనలాగా ఇలాంటి స్టంట్లు చేయకుండా .. ఇళ్లలోకి పాములు ప్రవేశిస్తే నిపుణులను పిలించి మాత్రమే పట్టుకోవాలన్నారు . తన ఇంట్లోకి వచ్చిన పాము ర్యాట్ స్నేక్ (జెర్రిపోతు) అని, అది విషపూరితమైనది కాదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పామును పట్టుకున్న విధానం

వైరల్ అయిన వీడియో

సోనూ సూద్ చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఇలాంటి పనులు ప్రమాదకరం కాబట్టి, నిపుణుల సహాయం తీసుకోవడం ముఖ్యమని ఆయన సూచించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.