|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆలియాకు సోనూ సూద్ మాస్ సపోర్ట్.. కెమెరాలు కాదు, ఈ మాటలే వైరల్!

Published: 15-05-2026, 6:31 AM
ఆలియాకు సోనూ సూద్ మాస్ సపోర్ట్.. కెమెరాలు కాదు, ఈ మాటలే వైరల్!
  • కాన్స్ లో ఆలియాకు అంతర్జాతీయ మీడియా గుర్తింపు లేదంటూ నెట్టింట భారీ ట్రోలింగ్.
  • ట్రోలర్స్ పై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సీరియస్ గా స్పందించారు.
  • ఆలియాకు మద్దతుగా పవర్‌ఫుల్ పోస్ట్ షేర్ చేసిన సోనూ సూద్ మాటలు వైరల్.
  • కెమెరా గుర్తింపు కాదు, ధైర్యమే నిజమైన విజయమని సోనూ సూద్ సందేశం.

టాలీవుడ్, బాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన వార్త ఇది! కాన్స్ వేదికపై ఆలియా భట్ కు ఎదురైన అనుభవం, దానిపై సోనూ సూద్ సంచలన వ్యాఖ్యలు.. అభిమానులను షాక్ కు గురిచేస్తున్నాయి. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

కాన్స్ లో ఆలియాకు అవమానం?

ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆమె రెడ్ కార్పెట్‌పై నడుస్తున్నప్పుడు అంతర్జాతీయ మీడియా ఆమెను పెద్దగా పట్టించుకోలేదంటూ నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఇలా మెసెజ్ పెట్టగా.. దానికి ఆలియా తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. అయ్యో పాపం అనే మాట ఎందుకులెండి. మీరు నన్ను గర్తించారు కదా అని రిప్లై ఇచ్చింది. ఈ విషయంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, ఈ నెగిటివిటీపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పందిస్తూ ఆలియా భట్‌కు మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియా ద్వారా ఒక పవర్‌ఫుల్ నోట్ షేర్ చేశారు.

“మన దేశానికి చెందిన ఒక వ్యక్తి అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టినప్పుడు, అది మనకు గర్వకారణం కావాలి. అంతేగానీ అందులో తప్పులు వెతకకూడదు. ప్రతి విజయానికి కెమెరాలు, హెడ్‌లైన్స్ లేదా తెలియని వ్యక్తుల గుర్తింపు అవసరం లేదు. అక్కడ నిలబడే ధైర్యం చేయడం, మన కళకు ప్రాతినిధ్యం వహించడం, ఆ ప్రయాణాన్ని హుందాగా ముందుకు తీసుకెళ్లడమే ఒక గొప్ప విజయం” అని రాసుకొచ్చారు. అలాగే, “ట్రోలింగ్‌కు అలవాటు పడిన ఈ ప్రపంచంలో, ఇతరులను ప్రోత్సహించడం నేర్చుకోండి. ఎందుకంటే తమ కలలను నిర్మించుకునే బిజీలో ఉన్నవారికి, ఇతరులను కిందికి లాగే సమయం ఉండదు. కీప్ షైనింగ్ మై ఫ్రెండ్.. చూడాల్సిన వాళ్లు నీ ప్రతిభను చూశారు” అంటూ ఆలియాకు ధైర్యం చెప్పారు.

ట్రోలర్స్ కు సోనూ సూద్ గట్టి కౌంటర్!

ఆలియాకు ధైర్యం చెప్పిన సోనూ సూద్ మాటలు!

కాన్స్ వేదికపై ఆలియాకు ఎదురైన పరిస్థితి, దానిపై సోనూ సూద్ ఇచ్చిన మద్దతు నిజంగా ప్రశంసనీయం. ఈ వివాదంపై మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ కోసం వేచి చూడండి. తెలుగు సినిమా ప్రపంచం నుండి తాజా వార్తల కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.