|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కూలీ మూవీపై సౌందర్య షాకింగ్ కామెంట్స్! రజనీకాంత్ మూవీకి భారీ షాక్ ఇచ్చిన కూతురు!

Published: 05-02-2026, 2:35 AM
కూలీ మూవీపై సౌందర్య షాకింగ్ కామెంట్స్! రజనీకాంత్ మూవీకి భారీ షాక్ ఇచ్చిన కూతురు!
  • సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో నటించారు.
  • కూలీ సినిమా ఆగష్టు 14న విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచింది.
  • సౌందర్య రజనీకాంత్ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మాత్రమే నచ్చాయని అన్నారు.
  • కూతురే సినిమాని ఒప్పుకోలేదంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాపై ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ స్పందించారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు మాత్రమే తనకు నచ్చాయని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కూలీ సినిమాపై సౌందర్య అభిప్రాయం

Soundarya Rajinikanth:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న రజనీకాంత్ (Rajinikanth)ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నిజానికి గతంలో ఆయన సినిమాలు వెనుకబడడంతో రజనీకాంత్ పని అయిపోయిందని.. ఇక రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చునే సమయం ఆసన్నమైంది అని కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్న సమయంలో ‘జైలర్’ సినిమా చేసి గట్టి కం బ్యాక్ ఇవ్వడమే కాకుండా తనపై అనవసరపు కామెంట్లు చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు రజనీకాంత్

ఇకపోతే గత ఏడాదికి సూపర్ స్టార్ రజినీకాంత్ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి 50 వసంతాలు పూర్తయ్యాయి. దీనికి తోడు ఆయన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా చేశారు. ఈ సినిమా సమయంలోనే ఒక ప్రత్యేకమైన 50 ఇయర్స్ టైటిల్ కార్డు కూడా డిజైన్ చేసి మరి థియేటర్లలో వేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా థియేటర్లలో సినిమా ప్రారంభం కాకముందే ఈ టైటిల్ కార్డు వేయడం అనేది ఆడియన్స్ కి మంచి హైప్ క్రియేట్ చేసింది. అలాంటి ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య 2024 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది.

నెటిజన్స్ రియాక్షన్

ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోవడం గమనార్హం . అయితే అలాంటి ఈ సినిమాపై ఆ రోజే ఆయన కూతురు సౌందర్య రజినీకాంత్(Soundarya Rajinikanth) తన అభిప్రాయాన్ని చెప్పుకొస్తూ ఒక పోస్ట్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాపై చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

సౌందర్య రజనీకాంత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా నాన్న నటించిన కూలీ సినిమాలో మా నాన్నను యంగ్ లుక్కులో చూపించిన చివరి పది నిమిషాల ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మాత్రమే నాకు బాగా నచ్చాయి. అయితే ఒక అభిమానిగా సినిమా నుంచి నేను ఇంకా ఎక్కువ ఆశించాను” అంటూ ఆమె తెలిపింది. ఇకపోతే రజనీకాంత్ కూతురు కూడా ఒక అభిమానిగా తాను ఆశించిన సన్నివేశాలు ఈ సినిమాలో లేవని స్పష్టం చేయడంతో మరి ఇంత దారుణంగా లోకేష్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆయన కూతురే ఈ సినిమాను ఒప్పుకోలేదంటే సదరు ఆడియన్ ఇంకెలా ఒప్పుకుంటాడు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

రజనీకాంత్ తదుపరి సినిమాలు

రజనీకాంత్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. కూలీ సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్న రజినీకాంత్.. ప్రస్తుతం జైలర్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలాగే కమలహాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఒక సినిమా చేస్తున్న ఈయన.. అలాగే కమలహాసన్ తో కలసి ఒక మల్టీస్టారర్ సినిమా కూడా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్న రజినీకాంత్ ఈ సినిమాలతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సౌందర్య రజనీకాంత్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూతురే సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ చిత్రంపై మరింత చర్చ జరుగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.