
జియోహాట్‌స్టార్‌లో ప్రేక్షకులను అలరించిన స్పెషల్ ఆప్స్ సిరీస్ రెండో సీజన్ త్వరలో రానుంది. కానీ రిలీజ్ డేట్ వాయిదా పడటంతో పాటు, ఒక ఆసక్తికరమైన వార్త కూడా వెలువడింది.
Key Points
స్పెషల్ ఆప్స్ 2.0 రిలీజ్ డేట్ వాయిదా
అన్ని ఎపిసోడ్లు ఒకేసారి విడుదల
జియోహాట్‌స్టార్ లో జులై 18 నుండి స్ట్రీమింగ్
రిలీజ్ డేట్ వాయిదా
జియోహాట్‌స్టార్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్ (Special Ops). ఈ సిరీస్ ఇప్పుడు స్పెషల్ ఆప్స్ 2.0తో రాబోతోంది. అయితే ఈవారమే ఓటీటీలోకి రావాల్సి ఉన్నా.. రిలీజ్ డేట్ ను వారం పాటు వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఈ సిరీస్ లో హిమ్మత్ సింగ్ పాత్ర పోషించిన కే కే మేనన్ ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.
స్పెషల్ ఆప్స్ 2.0 వెబ్ సిరీస్ నిజానికి వచ్చే శుక్రవారం (జులై 11) జియోహాట్‌స్టార్ లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఇప్పుడీ రిలీజ్ ను వాయిదా వేశారు. జులై 11 బదులుగా జులై 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కొన్ని విషయాలు తమ చేతుల్లో ఉండవని, అందుకే రిలీజ్ వాయిదా వేయాల్సి వచ్చిందని ఈ సిరీస్ లీడ్ రోల్ కే కే మేనన్ చెప్పాడు. ఇది నిజంగా అభిమానులకు బ్యాడ్ న్యూసే.
అన్ని ఎపిసోడ్లు ఒకేసారి
అయితే అన్ని ఎపిసోడ్లను ఒకేసారి రిలీజ్ చేయనున్నట్లు కూడా ఈ సందర్భంగా అతడు వెల్లడించాడు. దీంతో ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అయింది. నిజానికి జియోహాట్‌స్టార్ ఓటీటీ తమ ఒరిజినల్స్ ను వారానికి ఓ ఎపిసోడ్ చొప్పున రిలీజ్ చేస్తూ వస్తోంది. ఈ మధ్యే వచ్చిన క్రిమినల్ జస్టిస్ సీజన్ 4ను కూడా ఇలాగే తీసుకొచ్చింది. కానీ స్పెషల్ ఆప్స్ 2.0 విషయంలో మాత్రం అన్ని ఎపిసోడ్లు ఒకేసారి తీసుకురానుండటం విశేషం.
స్పెషల్ ఆప్స్ 2.0 వెబ్ సిరీస్ ట్రైలర్ ను గత నెల 16నే రిలీజ్ చేశారు. ఇందులో హిమ్మత్ సింగ్ అనే పవర్ ఫుల్ పాత్రతో కే కే మేనన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చూపించారు. ఈసారి సైబర్ వార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచానికి ఏర్పడే ముప్పుతో హిమ్మత్ సింగ్ అండ్ టీమ్ ఫైట్ చేయబోతున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. డాక్టర్ భార్గవ్ అనే దేశంలోని టాప్ సైంటిస్ట్ కిడ్నాపింగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. అతన్ని కాపాడటానికి హిమ్మత్ సింగ్ అండ్ టీమ్ రంగంలోకి దిగుతుంది.
సైబర్ థ్రిల్లర్ కథ
అయితే ఈసారి సైబర్ వార్ వాళ్లకు మరింత సవాలుగా మారుతుంది. సైబర్ వార్ గెలిచే వాళ్లదే ఈసారి విజయం అనే డైలాగ్ హిమ్మత్ సింగ్ నోటి నుంచి రావడం ఈ ట్రైలర్లో చూడొచ్చు. దేశంలో యూపీఐ డేటాబేస్ లక్ష్యంగా సైంటిస్ట్ కిడ్నాప్, తర్వాత కథ సాగబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. జులై 18 నుంచి జియోహాట్‌స్టార్ లో స్పెషల్ ఆప్స్ 2.0 స్ట్రీమింగ్ కాబోతోంది.
చివరగా, స్పెషల్ ఆప్స్ 2.0 అభిమానులకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ ఇచ్చింది. రిలీజ్ డేట్ వాయిదా పడినా, అన్ని ఎపిసోడ్లు ఒకేసారి విడుదల కానున్నాయి. జులై 18న జియోహాట్‌స్టార్‌లో ఈ సిరీస్‌ను ఆస్వాదించండి.


