|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తొలి మలయాళం వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. తెలుగులోనూ.. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Published: 12-06-2025, 5:28 AM
తొలి మలయాళం వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. తెలుగులోనూ.. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఇదే!

జియోహాట్‌స్టార్‌లో ప్రేక్షకులను అలరించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కేరళ క్రైమ్ ఫైల్స్’ రెండో సీజన్ త్వరలోనే రానుంది. తెలుగుతో సహా అనేక భాషల్లో ఈ సీజన్ స్ట్రీమింగ్ కానుంది.

Key Points

1

కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 జూన్ 20న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్.

2

తెలుగుతో సహా అనేక భాషల్లో విడుదల.

4

నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన కథ.

కేరళ క్రైమ్ ఫైల్స్ రెండో సీజన్ విడుదల తేదీ

మలయాళం నుంచి వచ్చిన తొలి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్. అహ్మద్ కబీర్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ రెండో సీజన్ ట్రైలర్ తోపాటు ఇందులోని పాత్రలను కొన్ని రోజులుగా జియోహాట్‌స్టార్ పరిచయం చేస్తూ వస్తోంది. అయితే ఇప్పటి వరకూ అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని మాత్రం అనౌన్స్ చేయలేదు.

తాజాగా ఓటీటీప్లేలో వచ్చిన వార్తల ప్రకారం.. కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ రెండో సీజన్ జూన్ 20 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాదు కొత్త సీజన్లో ఆరు నుంచి 8 ఎపిసోడ్లు ఉంటాయని కూడా వెల్లడించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

భాషలు మరియు ఎపిసోడ్ల సంఖ్య

ఈ కొత్త సీజన్ కూడా మలయాళం తోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తొలి సీజన్ జూన్ 23, 2023లో స్ట్రీమింగ్ అయింది. ఆ లెక్కన సరిగ్గా రెండేళ్ల తర్వాత రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొన్ని రోజుల కిందట రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఆసక్తికరంగా సాగింది.

కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ తొలి సీజన్లో లాల్, అజు వర్గీస్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. అహ్మద్ కబీర్ డైరెక్ట్ చేశాడు. ఓ వేశ్య హత్య, ఆ తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్ చుట్టూ తొలి సీజన్ తిరుగుతుంది. ఈ కేసును సవాలుగా తీసుకొని ఓ సీఐ, ఎస్ఐ ఎలా దర్యాప్తు జరిపారన్నది కేరళ క్రైమ్ ఫైల్స్ తొలి సీజన్లో చూడొచ్చు.

కథాంశం మరియు ప్రత్యేకతలు

కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన సీఐడీ సిరీస్ లాగే.. ఈ కేరళ క్రైమ్ ఫైల్స్ తొలి సీజన్ కూడా సాగుతుంది. చిన్న క్లూ కూడా లేని ఓ మ‌ర్డ‌ర్ కేసును కొంద‌రు పోలీసులు ప‌ట్టుద‌ల‌గా ఆరు రోజుల్లోనే ఎలా పరిష్కరించారన్నదే ఈ ఆరు ఎపిసోడ్స్ సిరీస్‌లో చూపించారు డైరెక్ట‌ర్ అహ్మ‌ద్ క‌బీర్‌.

సాధార‌ణంగా క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాలు, సిరీస్‌లు ఊహించ‌ని మ‌లుపుల‌తో ఫాస్ట్‌ఫేజ్‌లో సాగుతుంటాయి. హీరో త‌న తేలివితేట‌ల్ని ఉప‌యోగించి క్రైమ్‌ను ఎలా సాల్వ్ చేశాడ‌న్న‌ది చూపిస్తుంటారు. కానీ కేర‌ళ క్రైమ్ ఫైల్స్ సిరీస్ అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది. ఓ మ‌ర్డ‌ర్ కేసును పోలీసులు నిజంగా ఎలా ఇన్వేస్టిగేట్ చేస్తారు? ఈ క్ర‌మంలో వారికి ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను చాలా స‌హ‌జంగా స్క్రీన్‌పై చూపించారు డైరెక్ట‌ర్‌.

మొత్తానికి, కేరళ క్రైమ్ ఫైల్స్ రెండో సీజన్ తెలుగు ప్రేక్షకులకు మరోసారి ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ అనుభవాన్ని అందించనుంది. జూన్ 20న జియోహాట్‌స్టార్‌లో ఈ సిరీస్‌ని వీక్షించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.