|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విదేశాల్లో స్పిరిట్‌

Published: 18-10-2025, 7:18 PM
విదేశాల్లో స్పిరిట్‌

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా, త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మెక్సికోతో సహా పలు విదేశాల్లో జరగనుంది. దీనికి సంబంధించిన తాజా అప్‌డేట్‌లు ఇక్కడ చూడండి.

Key Points

1

ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో 'స్పిరిట్' చిత్రం రూపుదిద్దుకుంటోంది.

2

త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటించనుంది; ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

4

హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం; 'స్పిరిట్' 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం.

ప్రభాస్ ‘స్పిరిట్’: నటీనటులు, పాత్రలు

హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్‌’. ఈ చిత్రంలో ‘యానిమల్‌’ సినిమా ఫేమ్‌ త్రిప్తీ దిమ్రి హీరోయిన్‌గా నటించనున్నారు. ప్రభాస్‌పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్న తొలి చిత్రం ఇది. డాక్టర్‌ పాత్రలో త్రిప్తి కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ డిసెంబరు చివర్లో లేదా జనవరి ప్రారంభంలో మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్‌ పనులు జోరుగా జరుగుతున్నాయట. కాగా ఈ  సినిమా షూటింగ్‌కి సంబంధించిన కొంత భాగాన్ని మెక్సికోలో జరపనున్నట్లు సందీప్‌ ఓ సందర్భంలో పేర్కొన్నారు.

మరి… తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ మెక్సికోలోనే జరుగుతుందా? లేక హైదారాబాద్‌లోప్రారంభం అవుతుందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ విదేశాల్లోనే జరుగుతుందట. ఈ చిత్రం సంగీత దర్శకుడు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ కంపోజ్‌ చేసిన కొన్ని ట్యూన్స్‌ను సందీప్‌ ఆల్రెడీ ఫైనలైజ్‌ చేశారని టాక్‌. భూషణ్‌కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మించనున్న ఈ ‘స్పిరిట్‌’ సినిమా 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ‘ది రాజాసాబ్, ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) చిత్రా లతో ప్రభాస్‌ బిజీగా ఉన్నారు.

మెక్సికోలో ‘స్పిరిట్’ షూటింగ్?

‘స్పిరిట్’ విడుదల, సంగీతం, ఇతర చిత్రాలు

‘స్పిరిట్’ సినిమా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు తగ్గట్టుగా సినిమా అత్యున్నత ప్రమాణాలతో వస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. 2026లో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.