
📌 Key Points
- శ్రీ విష్ణు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
- కామెడీనే నమ్ముకుంటే కెరీర్ ముగుస్తుందనే భయంతో శ్రీ విష్ణు రిస్క్ చేస్తున్నాడు.
- హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో మృత్యుంజయ్ మూవీ తెరకెక్కుతోంది.
- ఈ సినిమాలో రెబా మౌనిక జాన్ హీరోయిన్ గా నటిస్తోంది.
శ్రీ విష్ణు తన కామెడీ ఇమేజ్ నుండి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. అల్లూరి, ఓం భీమ్ బుష్ చిత్రాల తర్వాత ఇప్పుడు మృత్యుంజయ్ మూవీతో మరోసారి తన లక్ ను పరీక్షించుకోనున్నారు. ఈ సినిమాతో ఆయన సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి.
శ్రీ విష్ణు కామెడీ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా?
Sree Vishnu:సాధారణంగా కొంతమంది హీరోలకు కొన్ని జానర్లలోనే పట్టు బాగా ఉంటుంది. ఒకవేళ దానిని దాటి ఇతర జానర్ లలో సత్తా చాటాలి అని ప్రయత్నిస్తే మాత్రం.. అందుకు తగ్గట్టు కష్టం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమంది ఇన్ని రోజులూ కామెడీని నమ్ముకొని సినిమాలు చేసి సడన్గా జానర్ మార్చి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అల్లరి నరేష్ ఒకప్పుడు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని సడన్గా నాంది లాంటి చిత్రాలతో సీరియస్ లుక్ లో కనిపించి ఒక మోస్తారు ప్రేక్షకులను మెప్పించినా.. ఆ తర్వాత కూడా అదే జానర్ లో సినిమాలు చేస్తుండడంతో పెద్దగా వర్కౌట్ కాలేదనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆల్కహాల్ సినిమా చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు అన్నీ తెలిసి కూడా తనకు సంబంధంలేని జానర్లలో అడుగుపెట్టి చేతులు కాల్చుకుంటున్నారు మరో యంగ్ హీరో శ్రీ విష్ణు (Sri Vishnu). ఇప్పటికే అల్లూరి, ఓం భీమ్ బుష్ వంటి విభిన్నమైన జానర్లలో సినిమాలు చేసి డిజాస్టర్ ను మూటగట్టుకున్న ఈయన ఇప్పుడు మళ్లీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో మృత్యుంజయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. నిజానికి ఆయన స్ట్రెంత్ కేవలం కామెడీ మాత్రమే.. అలాంటిది కామెడీని పక్కనపెట్టి ఇలా విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కామెడీకే శ్రీ విష్ణు పరిమితం అయ్యాడనే వ్యాఖ్యలను పక్కన పెట్టి సరికొత్త జానర్ లో మృత్యుంజయ్ అనే సినిమా చేస్తున్నారు మరి శ్రీ విష్ణు కామెడీ సినిమాలకు మాత్రమే పనికొస్తాడు అనే సెంటిమెంటును ఈ సినిమా ద్వారా బ్రేక్ చేస్తాడా అన్న విషయం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.
మృత్యుంజయ్ మూవీ స్టోరీ లైన్ ఏంటి?
విభిన్న జానర్లలో శ్రీ విష్ణు ప్రయత్నాలు ఫలిస్తాయా?
శ్రీ విష్ణు మృత్యుంజయ్ సినిమా విషయానికి వస్తే.. లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీగా మృత్యుంజయ్ సినిమా రాబోతోంది. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 6 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో రెబా మౌనిక జాన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. కాలభైరవ సంగీతం అందించారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో రచ్చ రవి, సుదర్శన్, ఐశ్వర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే ఎప్పుడైతే అల్లూరి , ఓం భీమ్ పుష్ వంటి చిత్రాలు చేసి బొక్క బోర్ల పడ్డారో ఇక అప్పటినుంచి శ్రీ విష్ణు కామెడీ తప్ప మిగతా ఏ జానర్ కి సెట్ కాడు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న మృత్యుంజయ్ లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తో ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మరి ఈ సినిమాతో శ్రీ విష్ణు ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి .ఇక ఈ చిత్రానికి సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
శ్రీ విష్ణు కామెడీ సినిమాలు మాత్రమే చేయగలడు అనే ముద్రను చెరిపేయడానికి మృత్యుంజయ్ సినిమాతో ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా ఫలితం ఆయన భవిష్యత్ కెరీర్‌కు చాలా కీలకం కానుంది. వేచి చూడాలి.


