|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దురంధర్ 2 మాయలో పడి చేతులు కాల్చుకుంటావా జక్కన్నా ?

Published: 29-03-2026, 10:35 AM
దురంధర్ 2 మాయలో పడి చేతులు కాల్చుకుంటావా జక్కన్నా ?
  • రాజమౌళి ‘వారణాసి’ సినిమా రెండు భాగాలుగా రానుందా?
  • ‘ధురంధర్-2’ విజయం రాజమౌళి నిర్ణయంపై ప్రభావం చూపిందా అనే అనుమానాలు.
  • మహేష్ బాబు కెరీర్‌కు రాజమౌళి సినిమాతో ఐదేళ్ల విరామం తప్పదా?
  • రికార్డుల కోసమే కథను మార్చేస్తున్నారా అని నెటిజన్ల ప్రశ్నలు.

దర్శకుడు రాజమౌళి ‘వారణాసి’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారా? బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్-2’ విజయం దీనికి కారణమా? దీనిపై నెటిజన్లు మరియు సినీ విశ్లేషకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

‘వారణాసి’ రెండు భాగాలుగా ఎందుకు?

Rajamouli Varanasi: దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి.. . తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శక ధీరుడు. ఇక జక్కన్నకి తన సినిమాపై ఉండే క్లారిటీకి వంక పెట్టె పనే లేదు.కానీ, ఇప్పుడు ‘ వారణాసి’ విషయంలో జక్కన్న  నిర్ణయాలు చూస్తుంటేనే ..”అసలు జక్కన్నకు ఏమైంది?” అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్ .అవును .. మొన్నటి వరకు “సింగిల్ పార్ట్.. ఒకే సినిమా” అని ఊదరగొట్టిన రాజమౌళి, ఇప్పుడు సడన్‌గా ప్లేటు ఫిరాయించి ‘ వారణాసి’ ని రెండు భాగాలుగా చేయాలని ఫిక్స్ అయ్యారట.  మరి దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసా ..రెండు వేలకోట్ల వైపు పరుగులు పెడుతున్న బాలీవుడ్ మూవీ ‘ ధురంధర్-2′ అని ఇండస్ట్రీ టాక్ .దీంతో పక్కోడి హిట్ చూసి ఇలా  టెంప్ట్ అయిపోయి, మన సినిమా జాతకాన్ని మార్చేయడం ఎంతవరకు కరెక్ట్ జక్కన్నా? అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు నెటిజన్లు.

కథ కంటే రికార్డులకే ఎక్కువ ఇంపార్టెన్స్?

నిజానికి.. క్రీస్తుపూర్వం 2700 నుంచి 2027 వరకు..అంటే వారణాసి స్పాన్ చాలా పెద్దదే..కానీ మొదటగా ఒకే పార్ట్ లో కంప్లీట్ చేస్తానని హింట్ ఇచ్చిన జక్కన్న ఇపుడు ” ధురంధర్-2′ మూడున్నర గంటల సినిమా అయినా జనం చూశారు కదా” అని తన సినిమాను కూడా  రెండు భాగాలుగా మార్చి, ఒక్కో పార్టును అంత సేపు తీయాలని ప్లాన్ చేస్తున్నాడా.. ఏంటి అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్ .ముఖ్యంగా ‘ ధురంధర్-2′ రికార్డులను తిరగరాయాలంటే తన సినిమా కూడా రెండు పార్టులుగా తీసుకురావాలని జక్కన్న భావిస్తున్నట్టు లీకులు వస్తున్నాయి. అంటే ఇక్కడ కథ కంటే రికార్డులకే ఎక్కువ ఇంపార్టెన్స్  ఇస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రికార్డుల కోసమే రాజమౌళి ప్రయత్నమా?

మహేష్ కెరీర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష?

అన్నింటికన్నా ముఖ్యంగా రాజమౌళి కుటుంబ సభ్యుల నుంచే ఈ ‘ రెండు భాగాల’ వార్తలు బయటకు రావడం గమనార్హం. గతంలో బాహుబలికి కూడా ఇలాగే లీకులు వచ్చాయి. కానీ అప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు వేరు. ఇక మహేష్ బాబు కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉందని చెప్పక్కర్లేదు కూడా.మరో వైపు ఇప్పటికే రాజమౌళి సినిమా అంటే ఏళ్లకేళ్ళు అంకితమైపోవాల్సిందే అన్న టాక్ ఉంది. ఇక ఇప్పుడు గనుక 2 పార్ట్స్ అంటే మహేష్ బాబు ఇంకో ఐదేళ్లు గడ్డం పెంచుకుని ఇదే సినిమాకి లాక్ అయిపోవాలి .అంటే ఒక రకంగా ఇది మహేష్ కెరీర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష లాంటిదే!

మహేష్ బాబు కెరీర్‌కు ఐదేళ్ల జైలు శిక్షేనా?

‘ధురంధర్-2’ లాగా బాక్సాఫీస్ వద్ద వారణాసి మ్యాజిక్ చేయలేకపోతే

వాస్తవానికి  సినిమాను రెండు భాగాలుగా చేసే ట్రెండ్‌ను మొదలుపెట్టింది బాహుబలితో జక్కన్నే కావచ్చు.కానీ ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలు రెండు భాగాలుగా వచ్చి డిజాస్టర్లు అయిన సంగతి మనం మర్చిపోకూడదు కూడా. ఏది ఏమైనా పార్ట్-1 హిట్ అయితేనే పార్ట్-2 కి వాల్యూ..ఒకవేళ ‘ ధురంధర్-2′ లాగా బాక్సాఫీస్ వద్ద వారణాసి మ్యాజిక్ చేయలేకపోతే మాత్రం..అనవసరంగా సినిమాను సాగదీసి చేతులు కాల్చుకున్నట్టే . ఇక ఇప్పటికే మూవీ లవర్స్,ముఖ్యంగా ఘట్టమనేని ఫ్యాన్స్ మీ అప్‌డేట్ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వెయిట్ చేస్తున్నారు.మీరిలా  రెండు భాగాలు అని చెప్పి వారి ఆశలపై నీళ్లు చల్లకండి ప్లీజ్ !

మొత్తానికి రాజమౌళి ‘వారణాసి’ సినిమా విషయంలో తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.