|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: డైరెక్టర్‌పై మోనాలిసా సంచలన ఆరోపణలు! పరువు నష్టం దావాతో సనోజ్ మిశ్రా కౌంటర్!

Published: 27-03-2026, 8:35 AM
షాకింగ్: డైరెక్టర్‌పై మోనాలిసా సంచలన ఆరోపణలు! పరువు నష్టం దావాతో సనోజ్ మిశ్రా కౌంటర్!
  • డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మోనాలిసా ఆరోపణ.
  • మోనాలిసా ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తానని సనోజ్ మిశ్రా హెచ్చరిక.
  • మోనాలిసాతో చేస్తున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమాను నిలిపివేస్తున్నట్లు సనోజ్ మిశ్రా ప్రకటన.
  • సనోజ్ మిశ్రా తన పెళ్లిని వ్యతిరేకించినందుకే తనపై కుట్ర చేస్తుందని సనోజ్ మిశ్రా ఆరోపణ.

ప్రముఖ నటి మోనాలిసా భోంస్లే డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా సనోజ్ మిశ్రా ఆమెపై పరువు నష్టం దావా వేస్తానని, అంతేకాకుండా వారి సినిమాను కూడా ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

డైరెక్టర్‌పై మోనాలిసా సంచలన ఆరోపణలు

Monalisa Bhosle: మోనాలిసా భోంస్లే పరిచయం అవసరం లేని పేరు. ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ రాత్రికి రాత్రే వైరల్ గా మారడమే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగు మలయాళం సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న మోనాలిసా(Monalisa) ఇటీవల పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే . మోనాలిసా తన సహనటుడు ఫర్మాన్ ఖాన్(Farman Khan) అనే వ్యక్తిని ప్రేమించి కేరళలోని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు.

ఇలా ఈమె వివాహం చుట్టూ ఎన్నో వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈమె పెళ్లి గురించి దర్శకుడు సనోజ్ మిశ్రా(sanoj mishra) మాట్లాడుతూ మోనాలిసాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేశారని అది లవ్ జిహాద్ అంటూ ఈయన కామెంట్లు చేశారు. ఇలా మోనాలిసా పెళ్లిని ఈయన వ్యతిరేకించడంతో మోనాలిసా మాది లవ్ జిహాద్ కాదు అంటూ డైరెక్టర్ కు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. అయితే ఇటీవల మీడియా సమావేశంలో భాగంగా దర్శకుడు సనోజ్ మిశ్రా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. సనోజ్ మిశ్రా తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని తనని ఎక్కడపడితే అక్కడ టచ్ చేయటానికి ప్రయత్నించేవారు అంటూ ఆయనపై విమర్శలు కురిపించారు.

మోనాలిసా ఆరోపణలను ఖండించిన సనోజ్ మిశ్రా

ఈ విధంగా సనోజ్ మిశ్ర వ్యవహార శైలిపై మోనాలిసా చేసిన ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను ఎప్పుడైతే మోనాలిసా పెళ్లిని వ్యతిరేకించానో ఆ క్షణం నుంచి ఆమె తన పట్ల కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇలా తన గురించి లేనిపోని ఆరోపణలు చేసిన మోనాలిసా పై తాను పరువు నష్టం దావా వేస్తానని సనోజ్ మిశ్రా మోనాలిసాకు ఊహించని షాక్ ఇచ్చారు. ఇలా పరువు నష్టం దావా మాత్రమే కాకుండా ఈయన డైరెక్షన్ లో మోనాలిసా నటిస్తున్న “ది డైరీ ఆఫ్ మణిపూర్”(The Dairy Of Manipur) సినిమాని కూడా ఇంతటితో ఆపి వేస్తున్నానని ఈ సందర్భంగా సనోజ్ మిశ్రా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మోనాలిసాను పరిచయం చేసిన సనోజ్ మిశ్రా..

సినిమాను నిలిపివేస్తున్నట్లు సనోజ్ మిశ్రా ప్రకటన

ఇలా మోనాలిసా చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేయటమే కాకుండా సినిమాని కూడా నిలిపివేయడంతో మోనాలిసాకు ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. మరి డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలపై మోనాలిసా స్పందన ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. కుంభమేళాలో సెన్సేషనల్ గా నిలిచిన ఈమెను ఇండస్ట్రీకి హీరోయిన్ గా సనోజ్ మిశ్రా పరిచయం చేశారు. ఇలా తనని ఇండస్ట్రీకి పరిచయం చేసి వ్యక్తి పైన ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడంతో ఈయన కూడా పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. మరి ఈ వ్యాఖ్యలపై మోనాలిసా స్పందన తెలియాల్సి ఉంది.

సనోజ్ మిశ్రా ఆరోపణలను ఖండించడమే కాకుండా, ఆమెపై పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమయ్యారు. అంతేకాకుండా, వారిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాను కూడా ఆపేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై మోనాలిసా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.