
అదృష్టం పెద్దగా కలిసిరాకపోయినా, శ్రీలీల కెరీర్ దూసుకుపోతోంది. బాలీవుడ్‌లో అరంగేట్రం చేయకముందే వరుస ఆఫర్లతో బిజీగా మారింది. భారీ యాడ్స్‌తో పాటు కార్తీక్ ఆర్యన్ వంటి స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందుతోంది.
Key Points
శ్రీలీల ఇంకా బాలీవుడ్‌లో అరంగేట్రం చేయకముందే వరుస ఆఫర్లు పొందుతోంది.
కార్తీక్ ఆర్యన్‌తో 'ఆషికి 3'లో నటిస్తూ, 'దోస్తానా 2'లోనూ అవకాశం దక్కించుకుంది.
రణవీర్ సింగ్, బాబీ డియోల్‌తో కలిసి రూ. 150 కోట్లతో నిర్మించిన యాడ్‌లో మెరిసింది.
'మాస్ జాతర', 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలతో టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ లక్ష్యం.
బాలీవుడ్‌లో శ్రీలీల దూకుడు
శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. ఇంకా హిందీలో అరంగేట్రం చేయకముందే రెండో సినిమా ఆఫర్‌ను దక్కించుకుంది. దీన్ని బట్టి చూస్తే.. రష్మిక మందన్నా మాదిరిగా శ్రీలీల కూడా బాలీవుడ్‌లో స్థిరపడే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీలీల ఆషికీ ఫ్రాంచైజీ మూడవ భాగంలో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ ఇంకా సెట్స్ మీద ఉన్నలోపే దోస్తానా 2 చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు రణవీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్ కలిసి నటించిన ఒక యాడ్‌ను అట్లీ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
పెద్ద ప్రాజెక్ట్‌లు, భారీ యాడ్స్
ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. దాదాపుగా రూ. 150 కోట్లతో నిర్మించారు. ఈ యాడ్‌లో శ్రీలీల రెడ్ డ్రెస్సులో గ్లామరస్‌గా కనిపించింది. బాలీవుడ్ స్టైల్‌కు తగ్గట్టుగా ఆమె బాడీ లాంగ్వేజ్ ఉండటంతో.. మరికొంతమంది బీ-టౌన్ నిర్మాతలను ఆమె ఆకర్షించింది.
గతంలో కొన్ని ఫ్లాప్‌లతో ఇబ్బంది పడిన శ్రీలీల.. పుష్ప-2 మూవీలో ఐటెం సాంగ్ చేసి అందరినీ అలరించింది. పుష్ప-2 మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో హిట్ కావడంతో.. శ్రీలీల పాటకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాటతోనే ఆమెకు హిందీలో వరుసగా ఆఫర్లు వస్తున్నట్టు టాక్. ఇక తాజాగా విడుదలైన Chings Ad ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టేలా ఉంది.
టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ ఖాయమా?
కాగా, శ్రీలీల ప్రస్తుతం తెలుగులో రెండు, హిందీలో ఒకటి, తమిళంలో ఒక చిత్రం చేస్తోంది. హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన ‘ఆషికి 3’లో నటిస్తుండగా.. తమిళంలో ‘పరాశక్తి’ సినిమా చేస్తోంది. అటు తెలుగులో రవితేజతో ‘మాస్ జాతర’.. పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు చేస్తోంది. ఈ రెండు చిత్రాలు హిట్ అయితే.. శ్రీలీల మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ స్టేటస్ దక్కించుకోవడం ఖాయం.
వరుస ఆఫర్లు, భారీ ప్రాజెక్ట్‌లతో శ్రీలీల కెరీర్ విజయపథంలో సాగుతోంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఆమె చేస్తున్న సినిమాలు విజయం సాధిస్తే, ఆమె స్టార్‌డమ్ మరింత పెరిగి పాన్ ఇండియా హీరోయిన్‌గా స్థిరపడటం ఖాయం.


