|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: 2 నిమిషాల పాటకి శ్రీలీల 5 కోట్లు! టాలీవుడ్ లో రికార్డు సృష్టించిన హీరోయిన్!!

Published: 04-02-2026, 9:05 PM
షాకింగ్: 2 నిమిషాల పాటకి శ్రీలీల 5 కోట్లు! టాలీవుడ్ లో రికార్డు సృష్టించిన హీరోయిన్!!
  • శ్రీలీల క్రేజ్: టాలీవుడ్‌లో రెండు నిమిషాల పాట కోసం ఏకంగా రూ.5 కోట్లు ఛార్జ్!
  • భగవంత్ కేసరి, గుంటూరు కారంలో మెరిసిన శ్రీలీల.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది.
  • పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో శ్రీలీల హీరోయిన్.. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
  • పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ చేసిన శ్రీలీల.. సీనియర్ హీరో సినిమాలో మరో ఐటెం సాంగ్‌కు సిద్ధం!

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆమె ఒక్క పాటకే రూ.5 కోట్లు తీసుకుంటుందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

శ్రీలీల దూకుడు: టాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీ లీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పాపులర్ హీరోయిన్ గా ఎదిగింది. 2021లో పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల తార… ధమాకా సినిమాతోనే హిట్ అందుకుంది. ఈ సినిమాలో రవితేజ తో కలిసి మెరిసిన శ్రీ లీల, అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరోయిన్ శ్రీ లీల వెనక్కి చూసుకోలేదు.

ఉస్తాద్ భగత్ సింగ్‌లో శ్రీలీల సందడి

ఒకేసారి అర డజన్ కు పైగా హీరోయిన్ శ్రీ లీల‌ చేతిలోకి సినిమాలు వచ్చాయి. దీంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. నందమూరి బాలయ్యతో భగవంత్ కేసరి చేసిన హీరోయిన్ శ్రీ లీల, మహేష్ బాబు చేసిన గుంటూరు కారంలో కూడా మెయిన్ హీరోయిన్ రోల్ చేసింది. పూజ హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ ను పక్కకు నెట్టి ఛాన్స్ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీ లీల హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.

గుంటూరు కారం తరువాత మరింత క్రేజ్

వ‌రుస సినిమాలతో దూసుకెళుతోన్న హీరోయిన్ శ్రీ లీల మ‌రో ఐటెం సాంగ్ చేయ‌నున్నార‌ని టాక్ న‌డుస్తోంది. తెలుగులోనే సీనియ‌ర్ హీరో సినిమాలో చిందులు వేయ‌నున్నార‌ట‌. ఇక ఈ పాట కోసం రూ.5 కోట్లు వ‌సూలు చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఈ మేర‌కు న్యూస్ వైర‌ల్ గా మారింది. ఇప్ప‌టికే పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ చేసింది శ్రీ లీల‌. ఇక అటు తాజాగా నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీకి శ్రీ లీల‌ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ స్టేజ్ పైన మాట్లాడిన హీరోయిన్ శ్రీ లీల, మీతో మాట్లాడి మాట్లాడి అలసిపోయానని పేర్కొంది. అయితే వెంటనే డ్యాన్స్ చెయ్ అంటూ అక్కడే ఉన్న ఓ స్టూడెంట్ గట్టిగా అరుస్తాడు. దీంతో షాక్ అయిన శ్రీ లీల, పెళ్లాన్ని పిలిచిన‌ట్లు పిలుస్తున్నావ‌ని ఫైర్ అయిన వీడియో వైర‌ల్ అవుతోంది.

శ్రీలీల వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఆమె ఐటెం సాంగ్ కోసం 5 కోట్లు తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.