
📌 Key Points
- శ్రీలీల మాట్లాడుతూ పీరియడ్స్ సమయంలో కూడా తాను ఎన్నో సూపర్ హిట్ పాటలకు డాన్స్ చేశానని తెలిపింది.
- పీరియడ్స్ ను సాకుగా చూపకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని శ్రీలీల అభిప్రాయపడ్డారు.
- శ్రీలీల వ్యాఖ్యలపై కొందరు మద్దతు తెలుపగా, మరికొందరు మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు.
- శ్రీలీల డాక్టర్ వృత్తిలో ఉండి కూడా ఇలా మాట్లాడటం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం హీరోయిన్ శ్రీలీల పీరియడ్స్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు పనులు చేయడానికి ఇష్టపడరు కానీ, తాను మాత్రం పీరియడ్స్ ను సాకుగా చెప్పకూడదని ఆమె అన్నారు.
పీరియడ్స్ గురించి శ్రీలీల కామెంట్స్ వైరల్
Sreeleela: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో యంగ్ బ్యూటీ శ్రీలీల ఒకరు. ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ హిందీ భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. వృత్తిపరంగా డాక్టర్ అయినప్పటికీ శ్రీలీల మాత్రం తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల శ్రీలీల పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ఈమెకు పూర్తిగా నిరాశను మాత్రమే మిగిల్చింది..
కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు ధనుష్ సినిమాలో నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అలాగే బాలీవుడ్ సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల పీరియడ్స్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సాధారణంగా పీరియడ్స్ సమయంలో ఎంతోమంది అమ్మాయిలు వివిధ రకాల సమస్యలతో బాధపడుతుంటారు ఆ సమయంలో పనులు చేయడానికి కూడా ఇష్టపడరు కానీ శ్రీలీల మాత్రం పీరియడ్స్ ను సాకుగా చెప్పకూడదు అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
విమర్శలు మరియు మద్దతు తెలుపుతున్న నెటిజన్లు
తాను ఎన్నో సూపర్ హిట్ పాటలకు అద్భుతమైన డాన్స్ చేశాను. నేను చేసిన సూపర్ హిట్ సాంగ్స్ అన్ని కూడా దాదాపు పీరియడ్స్ సమయంలోనే చేశానని తెలిపారు. ఒక అమ్మాయిగా మనం పురుషులతో సమానంగా అవకాశాలు, అధికారం, హక్కులు కావాలనుకుంటే ఇలాంటి వాటిని సాకుగా చూపిస్తూ వెనుకడుగు వేయకూడదని ధైర్యంగా ముందుకు వెళ్లాలని ఈమె తెలియజేశారు. ఇలా పీరియడ్స్ గురించి శ్రీ లీల ఇలాంటి కామెంట్లు చేయడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీ లీల వృత్తిపరంగా వైద్యురాలు అనే సంగతి తెలిసిందే.
డ్యాన్సింగ్ క్వీన్ శ్రీ లీల…
వైద్యురాలు అయి ఉండి కూడా శ్రీలీల ఇలా మాట్లాడటం సమంజసమేనా?
ఇలా ఒక డాక్టర్ అయ్యిండుకొని పీరియడ్స్ సమయంలో ఒక అమ్మాయి అనుభవించే బాధ తనకు తెలుసు, పీరియడ్స్ సమయంలో అందరి పరిస్థితి ఒకేలా ఉండదు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా శ్రీలీల పీరియడ్స్ ను సాకుగా చెబుతారంటూ మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటూ కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం ఈమె మాట్లాడిన మాటలలో తప్పేముంది ఎలాంటి నొప్పినైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలి అంటూ చెప్పడంలో తప్పులేదు అంటూ శ్రీ లీలకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈమె పీరియడ్స్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక శ్రీలీల నటిగా మాత్రమే కాకుండా అద్భుతమైన డాన్సర్ అనే సంగతి మనకు తెలిసిందే. ఈమె పక్కన డాన్స్ చేయాలంటే హీరోలు కూడా కాస్త భయపడతారనే చెప్పాలి.
మొత్తానికి శ్రీలీల పీరియడ్స్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను సమర్ధిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.


