|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sreeleela: డిఫరెంట్ లుక్‌లో శ్రీలీల.. పోస్ట్ వైరల్

Published: 14-10-2025, 6:14 AM
Sreeleela: డిఫరెంట్ లుక్‌లో శ్రీలీల.. పోస్ట్ వైరల్

యంగ్ హీరోయిన్ శ్రీలీల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఏజెంట్ మిర్చి’ పేరుతో ఓ డిఫరెంట్, గ్లామరస్ లుక్‌ను పోస్ట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ కొత్త లుక్‌తో పాటు ఆమె రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇది సినిమానా, వెబ్ సిరీస్సా లేదా యాడ్ అన్నది త్వరలో తెలుస్తుంది.

Key Points

1

శ్రీలీల 'ఏజెంట్ మిర్చి' పేరుతో ఓ కొత్త గ్లామరస్, రఫ్ అండ్ టఫ్ లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

2

అక్టోబరు 19న ఈ ప్రాజెక్ట్ గురించిన ప్రకటన రానుందని పోస్ట్‌లో పేర్కొంది.

4

గత కొన్ని చిత్రాలు విజయవంతం కాకపోవడంతో, రాబోయే సినిమాలు ఆమె కెరీర్‌కు కీలకం కానున్నాయి.

శ్రీలీల ‘ఏజెంట్ మిర్చి’ లుక్

యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. ఈ ఏడాది ‘రాబిన్‌హుడ్’, ‘జూనియర్’ సినిమాలతో వచ్చింది. కానీ ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ఈనెల 31న ‘మాస్ జాతర’ మూవీతో రానుంది. దీనిపై పెద్దగా అంచనాలైతే లేవు. ఇవి కాకుండా తెలుగు, తమిళ, హిందీలో తలో చిత్రం చేస్తోంది. ఇప్పుడు ఇన్ స్టాలో కొత్తగా ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఇప్పుడిది ఏంటా అనే క్వశ్చన్ మార్క్‌గా మారింది.

శ్రీలీల రాబోయే చిత్రాలు

‘ఏజెంట్ మిర్చి’గా శ్రీలీల.. అక్టోబరు 19న ప్రకటన రానుందని చెబుతూ ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో గ్లామరస్‌గా రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపించింది. క్యాప్షన్ చూస్తుంటే ఇదేదో హిందీ ప్రాజెక్టులా అనిపిస్తుంది. అయితే అది సినిమానా లేదా వెబ్ సిరీస్ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇవేం కాకుండా యాడ్ లాంటిది అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

కెరీర్ పై ఆశలు, సవాళ్లు

ఇకపోతే శ్రీలీల ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, శివకార్తికేయన్ ‘పరాశక్తి’, కార్తిక్ ఆర్యన్‌తో ఓ రొమాంటిక్ సినిమా చేస్తోంది. ఇండస్ట్రీలో ఈ బ్యూటీ నిలబడాలంటే ఇవి కచ్చితంగా హిట్ కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన వరస చిత్రాల్లో నటించింది. కాకపోతే ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’తో పాటు ‘పుష్ప 2’లో ఐటమ్ సాంగ్ తప్పితే మిగతావి ఏవి ఉపయోగపడలేదు. ఇప్పుడు చేస్తున్న మూవీస్‌పై కాస్త బజ్ ఉంది. మరి శ్రీలీల లక్ ఏమవుతుందో చూడాలి?

శ్రీలీల తన కెరీర్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ‘ఏజెంట్ మిర్చి’ వంటి కొత్త ప్రాజెక్ట్‌లు, రాబోయే పెద్ద సినిమాలు ఆమెకు విజయాన్ని అందిస్తాయని ఆశిద్దాం. ఆమె తదుపరి అడుగుపై సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.