|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రెండు వారాల్లోనే ఓటీటీలోకి ‘శ్రీ చిదంబరం గారు’ చిత్రం! స్ట్రీమింగ్ తేదీ ఖరారు!

Published: 13-02-2026, 8:35 AM
రెండు వారాల్లోనే ఓటీటీలోకి 'శ్రీ చిదంబరం గారు' చిత్రం! స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
  • ‘శ్రీ చిదంబరం గారు’ చిత్రం ఫిబ్రవరి 19 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.
  • వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ సినిమాకు వినయ్ రత్నం దర్శకత్వం వహించారు.
  • వైకల్యం మనిషికే కానీ మనసుకు కాదని చాటి చెప్పేలా ఈ చిత్రం రూపొందింది.
  • చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి ఈ సినిమా నిర్మాతలు.

‘శ్రీ చిదంబరం గారు’ సినిమా విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 19 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. వినయ్ రత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించారు.

‘శ్రీ చిదంబరం గారు’ ఓటీటీ విడుదల వివరాలు

Sri Chidambaram Garu OTT: థియేటర్లో సినిమా మనుగడలో రోజురోజుకూ మార్చు వస్తుంది. మొన్నటి వరకు మినిమమ్ 4 వారాల తర్వాతే ఓటీటీకి సినిమాలు వచ్చేవి. రాను రాను ఈ సమయం మరింతగా తగ్గిపోతుంది. స్టార్ హీరోల సినిమాలు కూడా ఇప్పుడా నియమాన్ని పాటించడం లేదు. ఓటీటీ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. సినిమా రిలీజ్ తేదీలలో మార్పులు సంభవించినా, అనుకున్న తేదీకి సినిమా ఓటీటీలో దర్శనమివ్వాల్సిందే అనేలా పరిస్థితులు మారిపోయాయి. ఓటీటీ సంస్థలు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తున్నాయి. ఇక చిన్న సినిమాల పరిస్థితి అయితే మరీ దారుణం. అసలు ఓటీటీ సంస్థలు చిన్న సినిమాలను తీసుకోవడమే గొప్ప అనేలా ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. థియేటర్లలో విడుదలైన చిన్న సినిమాలకు ఒక వారం, లేదంటే రెండు వారాలకే స్ట్రీమింగ్ అనేలా కండీషన్స్ పెట్టి, ఓటీటీ సంస్థలు హక్కులు రాయించుకుంటున్నాయి. అలా, థియేటర్లో సినిమా మనుగడ రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఇప్పుడో సినిమా విడుదలైన రెండు వారాలకే థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

సినిమా విశేషాలు, నటీనటులు

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా, చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’ (Sri Chidambaram Garu). వంశీ తుమ్మల (Vamsi Thummala), సంధ్యా వశిష్ట (Sandhya Vasishta) జంటగా నటించిన ఈ చిత్రం వినయ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కింది. అతనికిది మొదటి చిత్రం. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి స్పందనను రాబట్టుకుంది. వైకల్యం మనిషికే కానీ, మనసుకు కాదని చాటి చెప్పేలా వచ్చిన ఈ సినిమా.. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా అందరి ప్రశంసలను అందుకుంది. అలాంటి ఈ చిత్రాన్ని కేవలం రెండో వారాల్లో ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. అవును ‘శ్రీ చిదంబరం గారు’ సినిమా ఫిబ్రవరి 19 నుంచి స్ట్రీమింగ్‌ (Sri Chidambaram Garu Streaming Date)కు రాబోతున్నట్లుగా, ఆ సినిమా హక్కులను సొంతం చేసుకున్న ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీ అధికారికంగా ప్రకటించింది.

ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడు?

సినిమా బాగున్నా కూడా, థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇష్టపడటం లేదు. అందుకేనేమో.. రెండు వారాలకే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ప్రస్తుతం చిన్న సినిమాలు ఓటీటీని నమ్ముకునే రోజులు పోయాయి. అలాంటిది, ఈ సినిమా హక్కులు అమ్ముడుపోవడం అంటే, సినిమా హిట్ కిందే లెక్క. ఆ విషయంలో ‘శ్రీ చిదంబరం’ సక్సెస్ కొట్టేశారు. ఓటీటీ‌ సంస్థలను నమ్ముకుని చాలా సినిమాలు ఇంకా బాక్సుల్లోనే ఉండిపోయాయి. మెల్లకన్నుతో నలుగురి కనిపించడానికి ఇబ్బంది పడే సోలమన్ అలియాస్ చిదంబరం తను ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. మరి థియేటర్స్‌లో మంచి స్పందనను రాబట్టుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఆదరణను పొందుతుందో చూడాలి.

మొత్తానికి, ‘శ్రీ చిదంబరం గారు’ చిత్రం థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం విశేషం. ఈ సినిమా ఈటీవీ విన్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.