|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా కోడలి మనసులో మాట! చిరంజీవి, నాగబాబుల గురించి అన్నాలేజ్నోవా ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Published: 26-03-2026, 4:35 AM
మెగా కోడలి మనసులో మాట! చిరంజీవి, నాగబాబుల గురించి అన్నాలేజ్నోవా ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
  • అన్నా లెజినోవా ఇంస్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చి ‘అన్నా కొణిదెల’గా ఖాతా ప్రారంభించారు.
  • చిరంజీవి, నాగబాబులను అన్నయ్యలుగా భావిస్తూ అన్నా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
  • పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతోనే సోషల్ మీడియాలోకి వచ్చినట్టు అన్నా తెలిపారు.
  • మెగా బ్రదర్స్ పై అన్నా చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబుల గురించి ఎమోషనల్ కామెంట్ చేశారు. వారిని అన్నయ్యలుగా భావిస్తూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లోకి అన్నా లెజినోవా ఎంట్రీ

Anna Lezhneva: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు సినిమాలలో.. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఈయన భార్య అన్నా లెజినోవా కూడా ఈమధ్య కాలంలో తన భర్త పవన్ కళ్యాణ్ తో కనిపిస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అలాంటి ఈమె తొలిసారి మార్చి 25 2026న బుధవారం అధికారికంగా ఇంస్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించడంతో మెగా అభిమానులలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా తన భార్యకు స్వాగతం పలుకుతూ చేసిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇకపోతే పవన్ కళ్యాణ్ భార్యగా అన్నా లెజినోవాకి పాపులారిటీ ఏ రేంజ్ లో ఉందో తాజాగా ఆమెకు వచ్చిన ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య నిరూపితం చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాకి “అన్నా కొణిదెల”అనే పేరుతో అధికారిక ఖాతాను ప్రారంభించింది. ఖాతా ప్రారంభించిన 10 నిమిషాల్లోనే 21 వేలకు పైగా ఫాలోవర్స్ చేరారు.. ఇక దీన్ని బట్టి చేస్తే పవన్ కళ్యాణ్ కారణంగా ఆయన భార్యకు పాపులారిటీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అలాగే తన భర్త పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఒక ఫోటోని అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోని షేర్ చేస్తూ..” చాలాకాలం తర్వాత ఇప్పుడు సరైన సమయం అనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఇక్కడికి వచ్చాను” అంటూ ఆమె రాసుకొచ్చారు. పైగా ఈమె తన బయోలో “రష్యన్ హార్ట్.? ఇండియన్ సోల్” అని పేర్కొనడం అందరిని ఆకర్షిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో అన్నాకు వెల్కం చెబుతూ విష్ చేశారు.

మెగా బ్రదర్స్ పై అన్నా ఎమోషనల్ పోస్ట్

ఇదిలా ఉండగా అన్నా కొణిదెల తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా మెగా బ్రదర్స్ అయినా చిరంజీవి, నాగబాబు(Nagababu )గురించి ఒక ఎమోషనల్ పోస్టు పంచుకుంది. పిలుపులు వేరైనా ఆ భావం ఒక్కటే అంటూ భావోద్వేగం అయింది. ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా రెండు ఫోటోలను పంచుకుంది. అందులో మొదటిది పవన్ కళ్యాణ్ చిరంజీవితో కలిసి దిగగా.. మరొకటి నాగబాబుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. “తనకు అన్నదమ్ములు లేరని, కానీ పెళ్లయి కొణిదెల కుటుంబంలోకి వచ్చిన తర్వాత చిరంజీవిని అన్నయ్య అని, నాగబాబును చిన్న అన్నయ్య అని పిలవడం భర్త నుంచి అలవాటైపోయిందని తెలిపింది. వరుసల పరంగా పిలుపులు వేరైనప్పటికీ మనసుతో వారిని తన సొంత సోదరులు గానే భావిస్తున్నాను” అంటూ రాసుకుంది. మొత్తానికైతే మెగా బ్రదర్స్ పై ఆమె చూపిస్తున్న ఈ అనురాగం నెటిజన్ల మనసును గెలుచుకుంటుంది..

అన్నాకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ విషెస్

పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విషయానికి వస్తే.. అన్నా లెజినోవా రష్యా కు చెందిన మోడల్. నటి కూడా.. పవన్తో కలిసి 2013 సెప్టెంబర్ 30న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.. వీరికి 2017లో మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు జన్మించారు.

Tags Anna Lezhneva mega family Share

అన్నా లెజినోవా మెగా కుటుంబం పట్ల తనకున్న అనుబంధాన్ని, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా అభిమానులు ఆమె ప్రేమను చూసి సంతోషిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.