|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’: థియేట్రికల్ రైట్స్ కుమ్మేసింది! సేఫ్ జోన్ లో సినిమా!!

Published: 19-02-2026, 8:35 AM
శ్రీ విష్ణు 'విష్ణు విన్యాసం': థియేట్రికల్ రైట్స్ కుమ్మేసింది! సేఫ్ జోన్ లో సినిమా!!
  • శ్రీ విష్ణు హీరోగా ‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరి 28న విడుదల కానుంది.
  • సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను 7.5 కోట్లకు రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ కొనుగోలు చేసింది.
  • ఈ సినిమాలో శ్రీ విష్ణు చిన్ను అనే వాస్తు పిచ్చి ఉన్న వ్యక్తిగా కనిపించనున్నాడు.
  • విష్ణు మరో సినిమా ‘మృత్యుంజయ’ కూడా విడుదల కావాల్సి ఉంది.

శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ‘విష్ణు విన్యాసం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం. సినిమా సేఫ్ జోన్ లోకి చేరడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది.

భారీ ధరకు అమ్ముడుపోయిన థియేట్రికల్ రైట్స్

Vishnu vinyasam: శ్రీ విష్ణు హీరోగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం విష్ణు విన్యాసం(Vishnu Vinyasam). ఈ సినిమా ఫిబ్రవరి 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు, నాయన సారిక జంటగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇటీవల విడుదల చేసిన టీజర్ చూస్తేనే స్పష్టం అవుతుంది. ఇక ఈ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగిందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులు భారీ ధరలకు అమ్ముడుపోయినట్టు ఇండస్ట్రీ సమాచారం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులను రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ (ఆస్ట్రేలియా వెంకట్) ఏకంగా 7.5 కోట్లకు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఇలా శ్రీ విష్ణు సినిమాకు 7.5 కోట్ల డీల్ రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. శ్రీ విష్ణు విష్ణు విన్యాసం సినిమా బిజినెస్ చూస్తుంటే ఈ సినిమా సేఫ్ జోన్ లోనే ఉందని తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో శ్రీ విష్ణు బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ తనదైన శైలిలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మరి విష్ణు విన్యాసం సినిమా ద్వారా రాబోతున్న ఈయన ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది.

సేఫ్ జోన్ లో శ్రీ విష్ణు సినిమా

ఈ సినిమాలో శ్రీ విష్ణు చిన్ను అనే పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇందులో ఈయన వాస్తు పిచ్చి ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నారని టీజర్ ద్వారా తెలియజేశారు. వాస్తు శాస్త్రం పై ఉన్న పిచ్చితో చిన్ను చేసే పనులు దాని చుట్టూ తిరిగే గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా రాబోతోందని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా పట్ల ఏర్పడిన బజ్ చూస్తుంటే మాత్రం విష్ణు మరోసారి హిట్ కొట్టబోతున్నారని స్పష్టమవుతుంది.

ఆలస్యంగా మృత్యుంజయ విడుదల..

చిన్నుగా శ్రీ విష్ణు నటన

ఈ సినిమాతో పాటు విష్ణు మృత్యుంజయ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కాబోతోందని వార్తలు వచ్చాయి ఇలా ఒకేసారి రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలపై విష్ణు క్లారిటీ ఇచ్చారు. తన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావని ఒక్కో సినిమా ఒక్కోసారి కొంత గ్యాప్ తో విడుదల అవుతాయని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం విష్ణు విన్యాసం సినిమా ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు. ఇక శ్రీ విష్ణు ఇటీవల శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాలో సంయుక్త మీనన్ భర్తగా క్యామియో పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

‘విష్ణు విన్యాసం’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాతో ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.