
📌 Key Points
- శ్రీనిధి శెట్టి, అనుష్క శెట్టి బంధుత్వంపై క్లారిటీ ఇచ్చిన కేజీఎఫ్ బ్యూటీ.. అభిమానుల్లో ఆసక్తికర చర్చ!
- వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’లో శ్రీనిధి శెట్టి నటన, త్రివిక్రమ్ దర్శకత్వం.. సినిమాపై అంచనాలు!
- అనుష్క శెట్టి డౌన్ టు ఎర్త్ స్వభావం, సహాయ గుణం గురించి శ్రీనిధి శెట్టి ప్రశంసలు, కలవాలని ఆసక్తి!
- సోషల్ మీడియాలో శ్రీనిధి శెట్టి సందడి, ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటూ క్రేజ్ పెంచుకుంటున్న హీరోయిన్!
క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి గురించి ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. అనుష్క శెట్టితో ఆమెకున్న సంబంధం గురించి వస్తున్న రూమర్స్‌పై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
అనుష్క, శ్రీనిధి శెట్టి మధ్య బంధుత్వం ఉందా?
క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) రాకింగ్ స్టార్ యష్(Yash) సరసన ‘కేజీఎఫ్’(KGF) మూవీలో నటించి మెప్పించింది. తన ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలించింది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రజెంట్ విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) సరసన ‘ఆదర్శ కుటుంబం’(Aadarsa Kutumbam) మూవీలో యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నాడు.
శ్రీనిధి శెట్టి కామెంట్స్ వైరల్!
అలాగే ఈ చిన్నది సోషల్ మీడియా(Social Media)లో కూడా నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. డైలీ ఏదో ఒక పోస్టుతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనిధిను యాంకర్ అనుష్క శెట్టి మీకేమైనా రిలేటివ్స్ ఆ అని అడుగుతాడు. ఎందుకుంటే ఈ ఇద్దరికీ పేరు చివర శెట్టి అని వస్తుంది కదా అందుకోసం. అప్పుడు
వెంకటేష్ మూవీలో శ్రీనిధి శెట్టి
ఆమె స్పందిస్తూ.. ‘లేదు.. కానీ నాకు ఒక నమ్మకం ఉంది. రెడ్డీస్ అందరూ ఎక్కడో ఒకచోట రిలేటివ్స్ అయి ఉంటారు. అలాగే మేము కూడా ఎక్కడో ఒకచోట బంధువుల అయి ఉండవచ్చు అని.. కానీ ప్రజెంట్ మేము బంధువులు కాము. కానీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు నేను తనని కలవలేదు. బట్ ఆమె గురించి చాలా విన్నాను. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటుందని, హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని, కైండ్ హార్ట్ అని.. సో ఆమెను మీట్ అవ్వాలని నాకు చాలా కోరికగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
శ్రీనిధి శెట్టి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుష్క, శ్రీనిధి భవిష్యత్తులో బంధువులు అవుతారేమో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


