|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

SS Rajamouli: ‘విలన్ ఛాలెంజ్ చేస్తే..’.. ఐ బొమ్మ రవి అరెస్ట్‌పై రాజమౌళి

Published: 17-11-2025, 5:25 AM
SS Rajamouli: 'విలన్ ఛాలెంజ్ చేస్తే..'.. ఐ బొమ్మ రవి అరెస్ట్‌పై రాజమౌళి

టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన ఐ బొమ్మ రవి అరెస్టుపై దర్శకధీరుడు రాజమౌళి స్పందించారు. విదేశాల నుంచి వస్తుండగా అరెస్టు చేయడం సినిమాలోని విలన్‌ను హీరో పట్టుకున్న సీన్‌లా ఉందని వ్యాఖ్యానించారు. పోలీసులకు, సీపీ సజ్జనార్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Key Points

1

ఐ బొమ్మ రవి అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

2

విదేశాల నుంచి వస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు ఐ బొమ్మ రవిని అదుపులోకి తీసుకున్నారు.

4

పోలీసులకు, సీపీ సజ్జనార్‌కు రాజమౌళి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఐ బొమ్మ రవి అరెస్ట్: టాలీవుడ్‌లో హాట్‌టాపిక్

కేవలం సినీ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌కు కోట్ల రూపాయల కొల్లగొట్టిన ఐ బొమ్మ రవి ఎట్టకేలక పోలీసులకు చిక్కాడు. విదేశాల నుంచి వస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతని గురించే చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐ బొమ్మ రవి గురించి ఆయన మాట్లాడారు. ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడం సినిమాలో సూపర్ హిట్ సీన్‌లా ఉందన్నారు. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరో తీసుకెళ్లి కటాకటాల వెనక్కి పంపినట్లు ఉందని తెలిపారు. తనకు తానే భస్మాసుర హస్తంలాగా తనకు తానే బయటపెట్టుకున్నాడు.. పోలీసులతో ఎవరూ కూడా ఛాలెంజ్ చేయవద్దని అన్నారు. ఐ బొమ్మ రవిని అరెస్ట్‌ చేసిన పోలీసులకు, సీపీ సజ్జనార్‌కు రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందే రాజమౌళితో పాటు మెగాస్టార్, నాగార్జున కలిసి సీపీ సజ్జనార్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పారు.

రాజమౌళి కామెంట్స్: ‘సినిమా సీన్‌లా ఉంది’

పోలీసులకు రాజమౌళి ధన్యవాదాలు

మొత్తంగా ఐ బొమ్మ రవి అరెస్టు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. రాజమౌళి వ్యాఖ్యలు ఈ ఘటనకు మరింత సినిమాటిక్ టచ్ ఇచ్చాయి. చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేరని రాజమౌళి పరోక్షంగా స్పష్టం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.