
దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటించే SSMB29 చిత్రం ఆఫ్రికాలో చిత్రీకరణ ప్రారంభించింది. ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసుకున్న యూనిట్ ఇప్పుడు కెన్యాకు వెళ్ళింది. నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం అంచనాలను పెంచుతోంది.
Key Points
మహేశ్ బాబు, రాజమౌళి చిత్రం SSMB29 ఆఫ్రికాలో చిత్రీకరణ
కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరణ
ప్రియాంక చోప్రా కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు
30 రోజుల పాటు జరుగనున్న ఈ షూటింగ్ నిధి అన్వేషణ నేపథ్యంలో జరుగుతుంది
ఆఫ్రికాలో SSMB29 చిత్రీకరణ
మహేశ్ బాబు(Mahesh Babu) కథానాయకుడిగా దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) తీస్తున్న చిత్రం పనులు స్పీడ్ అందుకున్నాయి. కొద్దిరోజుల క్రితం ఒడిసాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ భారీ ప్రాజెక్ట్ అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నా చిత్ర యూనిట్ ఇప్పుడు ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాల్లోకి షిఫ్ట్ అవుతుంది. కథ రీత్యా ఈ సినిమాలోని అత్యంత కీలకమై సీన్స్ ఇక్కడ షూట్ చేయనున్నారని తెలుస్తోంది.
కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్
SSMB29 టీమ్ జులైలో కెన్యాకు పయనమయ్యేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అక్కడ మసాయి-పిగ్మీస్ తెగలతో ఇప్పటికే మహేశ్‌బాబు కొద్దిరోజులు గడిపారు. ఆ ప్రాంతపు యుద్ధ విద్యలపై బేసిక్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడి షెడ్యూల్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. పలు కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు కావాల్సిన అన్ని అనుమతులు కూడా తీసుకున్నారట. దాదాపు 30రోజుల పాటు జరగనున్న షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసేశారట. అక్కడి ప్రఖ్యాత అంబోసెలి నేషనల్ పార్క్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
నిధి అన్వేషణ కథాంశం
కెన్యాలో జరిగే ఈ షెడ్యూల్‌లో ప్రియాంక చోప్రా సెట్స్‌లో అడుగుపెట్టనుంది. మహేశ్, పృథ్వీరాజ్ సుకుమార్‌తో పాటు మరికొందరు అక్కడ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇక ఈ సినిమాకు ‘మహారాజా’, ‘మహారాజ్’ అనే టైటిల్స్‌ను అనుకుంటున్నారని, 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఓ నిధి అన్వేషణతో ఈ సినిమా ఉంటుందనీ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
మొత్తానికి, SSMB29 చిత్రం ఆఫ్రికా షెడ్యూల్ తో మరింత ఆసక్తికరంగా మారింది. నిధి అన్వేషణ నేపథ్యం, భారీ బడ్జెట్ తో ఈ చిత్రం అంచనాలను అందుకుంటుందని అనిపిస్తుంది.


