|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రధాని మోడీ తల్లిగా స్టార్ హీరోయిన్..?

Published: 11-11-2025, 10:14 PM
ప్రధాని మోడీ తల్లిగా స్టార్ హీరోయిన్..?

ప్రధాని నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌పై ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్రంలో మోడీ తల్లి హీరాబేన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆసక్తికరమైన వార్త తెలుగు సినీ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

Key Points

1

ప్రధాని మోడీ బయోపిక్ 'మావందే' పేరుతో తెరకెక్కుతోంది.

2

ఉన్ని ముకుందన్ మోడీ పాత్రలో నటిస్తున్నారు.

4

రవీనా టాండన్ గతంలో KGF-2, బంగారు బుల్లోడు వంటి చిత్రాల్లో నటించారు.

మోడీ బయోపిక్ వివరాలు

ప్రధాని నరేంద్ర మోడీ.. భారతదేశ చరిత్రను మార్చేసిన గొప్ప వ్యక్తి. వరుసగా మూడుసార్లు ప్రధాని పీఠాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టించాడు ప్రధాని నరేంద్ర మోడీ. ముఖ్యంగా భారతదేశంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచి, ప్రపంచ దేశాలకు గట్టి పోటీని ఇస్తున్నారు. అయితే అలాంటి అఖండ విజయాలను సాధించిన ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే. ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ మావందే పేరుతో వస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు, ఇతర అప్డేట్స్ వచ్చేసాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరా బేన్ పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోబోతున్నారట. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రవీనా టాండన్ పేరును పరిశీలిస్తున్నారట. ఈమె ఇప్పటికే కేజిఎఫ్ రెండు పార్టీలలో నటించి మెప్పించారు. తెలుగులో బంగారు బుల్లోడు, ఆకాశ వీధి సినిమాల్లో మెరిశాలు. ఇక ఇప్పుడు మోడీ బయోపిక్ లో తల్లి పాత్రలో రవీనా టాండన్ కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

రవీనా టాండన్ హీరాబేన్ పాత్రలో

హీరోయిన్ రవీనా టాండన్ కెరీర్

ఈ వార్త నిజమైతే, మోడీ బయోపిక్‌కు మరింత హైప్ రావడం ఖాయం. రవీనా టాండన్ లాంటి అనుభవం ఉన్న నటి హీరాబేన్ పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.