
ఒడిశా నటి ఎలినా సమంత్ రాయ్ చేసిన పని సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సావిత్రి వ్రతం చేస్తున్న ఆమె భర్త కాళ్ళు కడిగిన నీటిని తాగడంతో నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. ఇది ఓవర్ యాక్షన్ అని వారు అభిప్రాయపడుతున్నారు.
Key Points
స్టార్ హీరోయిన్ ఎలినా సమంత్ రాయ్ సావిత్రి వ్రతం చేశారు.
భర్త కాళ్ళు కడిగిన నీటిని ఆమె తాగారు.
నెటిజన్లు ఆమె ఓవర్ యాక్షన్‌పై విమర్శలు చేస్తున్నారు.
ఆచారాలను అనుసరించడం మంచిదే కానీ, అతిగా చేయకూడదని నెటిజన్ల అభిప్రాయం.
ఎలినా సమంత్ రాయ్ వైరల్ వీడియో
ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలను ఫాలో కావడం మంచిదే. కానీ కొందరు మరీ ఓవర్ చేస్తుంటారు. అప్పుడే మనం ముందుకెళ్తున్నామా లేక ఇంకా వెనక్కే వెళ్తున్నామా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ చేసిన పని ఇలాగే ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఒడిశా ఇండస్ట్రీకి చెందిన నటి ఎలినా సమంత్ రాయ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఓవర్ యాక్షన్ మానుకోవాలని దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. సావిత్రి వ్రతం చేస్తున్న ఆమె.. ఈ సందర్భంగా భర్త పాదాలను కడిగింది. దీర్ఘ సుమంగళిగా ఉండాలని దీవెనలు తీసుకుంది. అంతటితో ఊరుకుంటే సరిపోయేది కానీ ఆ కాళ్లు కడిగిన నీటిని తాగింది. అదేదో ముక్తి లభించినట్లుగా ఫీల్ అయిపోయింది. ఆ తర్వాత భర్త ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టాడు. దీంతో నెటిజన్లు పొట్టుపొట్టు తిడుతున్నారు. సాధారణ గృహిణులు కూడా ఇలా చేయరని.. ఆచార వ్యవహారాలను లోతుగా ఫాలో అయ్యే వారు కూడా భర్త కాళ్లు కడిగిన నీటిని తాగరని, ఇలాంటివి ఇతరులు కూడా ఫాలో అవ్వాలని ఫోర్స్ చేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అప్‌డేట్ కాకపోయినా పర్లేదు కానీ ఇలాంటివి మాత్రం మానుకోవాలని సూచిస్తున్నారు.
నెటిజన్ల విమర్శలు మరియు ప్రతిస్పందనలు
ఆచారాలు మరియు ఆధునికత
చివరగా, సాంప్రదాయాలను పాటించడం మంచిదే కానీ, అతిగా చేయడం వల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎలినా సమంత్ రాయ్ ఘటన దీనికి ఒక ఉదాహరణ.


