|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆరు నెలల్లో హోటల్‌ రూమ్‌లో చనిపోయినా ఆశ్చర్యం లేదు.. డాక్టర్‌ చెప్పిన షాకింగ్‌ విషయం బయటపెట్టిన స్టార్‌ సింగర్‌ అద్నాన్ సమీ

Published: 05-06-2025, 12:20 PM
ఆరు నెలల్లో హోటల్‌ రూమ్‌లో చనిపోయినా ఆశ్చర్యం లేదు.. డాక్టర్‌ చెప్పిన షాకింగ్‌ విషయం బయటపెట్టిన స్టార్‌ సింగర్‌ అద్నాన్ సమీ

ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అతని అధిక బరువు వల్ల డాక్టర్లు చేసిన హెచ్చరికలు, అతను ఎలా బరువు తగ్గాడో ఈ కథనంలో తెలుసుకుందాం.

Key Points

1

స్టార్ సింగర్ అద్నాన్ సమీ బరువు 230 కిలోలకు చేరింది.

2

డాక్టర్లు ఆరు నెలల్లో మరణం ముప్పును హెచ్చరించారు.

4

ఆహార నియంత్రణతో బరువు తగ్గి, ఆరోగ్యంగా ఉన్నారు.

అద్నాన్ సమీ ఆరోగ్య పరిస్థితి

సింగర్ అద్నాన్ సమీ ఒక ఇంటర్వ్యూలో తన బరువు ఒకప్పుడు 230 కిలోలు ఉండేదని చెప్పారు. ఈ విషయం డాక్టర్లకు తెలియగానే, వారు అద్నాన్‌ని ఆయన తండ్రి ముందే బాగా మందలించారట. బరువు తగ్గకపోతే 6 నెలల్లో చనిపోతారని కూడా చెప్పారట.

అద్నాన్‌ సమీ ఇంటర్వ్యూలో చెబుతూ, డాక్టర్లు తన పరిస్థితి బోర్డర్ లైన్‌లో ఉందని చెప్పినట్టు వెల్లడించారు.  ఇదే లైఫ్‌స్టైల్ కంటిన్యూ చేస్తే, 6 నెలల తర్వాత హోటల్ రూమ్‌లో చనిపోయినా ఆశ్చర్యం లేదన్నారట. ఇది తనకు షాక్ గురి చేసిందని, కానీ ఈ విషయం నాన్న ముందు చెప్పడం తనకు కోపం తెప్పించిందన్నారు అద్నాన్‌ సమీ.

డాక్టర్ల హెచ్చరిక

`డాక్టర్లు మెలోడ్రామాటిక్‌గా ఉంటారని నాన్నతో చెప్పి వాళ్ళ మాట పట్టించుకోవద్దని అన్నాను. డాక్టర్ దగ్గర నుంచి వచ్చాక, నేరుగా బేకరీకి వెళ్లి అక్కడి సగం సామానులు తిన్నాను. నాన్న కోపంగా చూస్తూ, భగవంతుడికి భయం లేదా అని అడిగారు. డాక్టర్ మాట వినలేదని నన్ను మందలించారు. దానికి నేను డాక్టర్లు ఏదో ఒకటి అంటూనే ఉంటారని అన్నాను` అని వెల్లడించారు.

బరువు ఎక్కువగా ఉండటం వల్ల పడుకుని నిద్రపోలేక, చాలా సంవత్సరాలు కూర్చునే నిద్రపోయానని ఆయన చెప్పారు. తన బిడ్డను ఖననం చేయడం ఇష్టం లేదని నాన్న అన్నారని, ఆ తర్వాత బాగా ఏడ్చేసినట్టు తెలిపారు అద్నాన్‌.

బరువు తగ్గిన తర్వాత అద్నాన్

అప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకుని 120 కిలోలు తగ్గినట్టు చెప్పారు. సర్జరీ చేయించుకుని బరువు తగ్గారని చాలా మంది అన్నారు. కానీ అద్నాన్ ఆ వాదనలను ఖండించి, పోషకాలున్న ఆహారం తీసుకుని బరువు తగ్గినట్టు వెల్లడించారు. ఇప్పుడు ఆయన వంద కేజీలకు అటు ఇటుగా బరువుని మెయింటేన్‌ చేస్తున్నారు. చాలా స్లిమ్‌ అయ్యారు. మళ్లీ తన సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నారు అద్నాన్‌ సమీ.

చివరకు అద్నాన్ సమీ తన సంకల్ప శక్తితో 120 కిలోల బరువు తగ్గి, ఆరోగ్యంగా ఉన్నారు. ఇది అతని అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.