
📌 Key Points
- బిగ్ బాస్ 7 ద్వారా శుభశ్రీ రాయగురు గుర్తింపు పొంది, మంచి పాపులారిటీ సంపాదించారు.
- నిర్మాత-నటుడు అజయ్ మైసూరుతో శుభశ్రీ నిశ్చితార్థం జరిగింది, వారి పెళ్లి ఇంకా ప్రకటించలేదు.
- అజయ్ తన కాబోయే భార్య శుభశ్రీకి బ్రాండ్ న్యూ మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు.
- ఈ ప్రత్యేక మోడల్ కారు ఆస్ట్రేలియాలో కేవలం 20 మాత్రమే అందుబాటులో ఉండగా, అందులో ఇది ఒకటి.
బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ రాయగురుకి ఆమె ప్రియుడు, నిర్మాత అజయ్ మైసూరు మరో లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వడంతో శుభశ్రీ అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ కారు ధర, ప్రత్యేకతలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
శుభశ్రీ రాయగురు ప్రస్థానం: బిగ్ బాస్ నుంచి నిశ్చితార్థం వరకు
Subhashree Rayaguru: శుభ శ్రీ రాయగురు .. గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . మెడిసిన్ చదవిన ఈ భామ బిగ్ బాస్ షోతో గుర్తింపు పొందింది . బిగ్ బాస్ 7 సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చి ఓవర్ నైట్ అయిపోయింది . ఈ షోతో ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న శుభ శ్రీ .. హౌజ్ నుంచి బయటకు రాగానే పలు ప్రైవేట్ అల్భమ్స్ లో నటించిది . రోల్ రైడాతో కలిసి కాకినాడ ఖజానే తినిపిస్తాడంటూ పాటకు చిందులేసింది . ఈ పాట ఎంతో హిట్ అయ్యిందో తెలిసిందే . ఈ ప్రైవేట్ సాంగ్ తో శుభశ్రీ మరింత పాపులారిటీ సంపాదించుకుంది . దీంతో ఆమెకు ఫాలోవర్స్ కూడా భారీగా పెరిగిపోయారు .
అయితే ఆ తర్వాత సైలెంట్ అయిన ఆమె నిశ్చితార్థం కబురుతో ఒక్కసారిగా ఫ్యాన్స్ కి షాకిచ్చింది . నిర్మాత – నటుడు అజయ్ మైసూర్ తో పెళ్లిని ప్రకటించిన సంగతి తెలిసిందే . ఈ ఏడాది అతడిని నిశ్చితార్థం చేసుకుంది . వీరిద్దరూ మేజెస్టీ సాంగ్‌లో జంటగా నటించారు. ఆ పాటతోనే ప్రేమలో పడి జంటగా కలిసుండాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లెప్పుడన్నది మాత్రం ఇంకా చెప్పనేలేదు. అయితే శుభశ్రీ కాబోయే భర్త , అజయ్ ధనవంతుడనే విషయం తెలిసిందే . ఆయన దగ్గర ఎన్నో లగ్జరీ కార్ల కలెక్షన్స్ ఉన్నాయి .
ప్రియుడు అజయ్ మైసూరు: లగ్జరీ కార్ల కలెక్షన్
అన్ని కూడా లగ్జరీ బ్రాండ్సే . ఎంగేజ్మెంట్ తర్వాత తన కార్ల కలెక్షన్స్ కూడా చూపించాడు . ఇప్పటికే తన గ్యాలరీ మొత్తం లగ్జరీ బ్రాండ్ కార్లతో నిండిపోయింది . తాజాగా మరో లగ్జరీ బ్రాండ్ ని తన గ్యాలరీలో చేర్చాడు . బ్రాండ్ న్యూ మెర్సిడెస్ బెంజ్ కొనగోలు చేశాడు . బ్లాక్ అండ్ వైట్ బోర్ కొట్టేసిందని , ఈసారి కలర్ ఫుల్ కారుని తనకు కాబోయే భార్య శుభశ్రీకి గిఫ్ట్ గా ఇచ్చాడు . అంతేకాదు అంతేకాదు ఈ బ్రాండ్ తనకు ఇష్టమైనందని చెప్పాడు . ఆస్ట్రేలియాలో కేవలం ఈ బ్రాండ్ కార్లు కేవం 20 ఉన్నాయని , అందులో ఇదోకటి అని చెప్పాడు .
అందమైన శుభశ్రీకి అజయ్ లగ్జరీ కారు గిఫ్ట్
ఈ మేరకు శుభశ్రీతో కలిసి కొత్త కారుతో దిగిన ఫోటోలను అజయ్ తన ఇన్ స్టాలో షేర్ చేశాడు . ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ మోడల్ కారు ఆస్ట్రేలియాలో కేవలం 20 మాత్రమే అందుబాటులో ఉండగా అందులో ఒకదాన్ని అజయ్ జంట సొంతం చేసుకుంది. అదే విషయాన్ని అజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ.. ఇకనైనా బోర్ కొట్టే బ్లాక్ అండ్ వైట్ కార్లకు స్వస్తి పలికి కలర్‌ఫుల్ కార్లను కొనుగోలు చేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు. వీళ్లు కొన్న కారు గ్రీన్ కలర్‌లో .. ధర కోటికి పైనే ఉంటుందంటున్నారు. కాగా అజయ్.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, 10 th క్లాస్ డైరీస్, హ్యాంగ్‌మ్యాన్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రైవేట్ సాంగ్స్, పలు షార్ట్ ఫిలింస్‌లో నటించాడు.
Tags Subhashree Rayaguru Share
అజయ్ మైసూరు తన సంపదను, శుభశ్రీ పట్ల తన ప్రేమను ఈ లగ్జరీ కారుతో చాటుకున్నారు. ఈ బహుమతి వారి బంధాన్ని మరింత బలపరచడమే కాకుండా, వారి లగ్జరీ జీవనశైలికి నిదర్శనంగా నిలుస్తుంది. అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


