
హీరో సుధీర్ బాబు తన పర్ఫెక్ట్ బాడీ, ఫిట్నెస్ రహస్యాలను వెల్లడించారు. మహేష్ బాబు బావగా పేరున్న సుధీర్ బాబు.. తన డైట్ ప్లాన్‌తో పాటు, ఫిట్నెస్ ఉత్పత్తుల కంపెనీ ‘సెక్రేడ్ బీస్ట్’ను ప్రారంభించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Key Points
టాలీవుడ్‌లో ఫిట్ బాడీ మెయింటైన్ చేసే హీరోలలో సుధీర్ బాబు ఒకరు.
రోజుకు ఐదారు సార్లు కొంచెం కొంచెంగా తింటానని, ఎగ్స్, మీట్, పుల్కా ముఖ్య ఆహారమని తెలిపారు.
ఎక్కువగా కూరగాయలు, తక్కువ రైస్, మీట్ తీసుకుంటానని, చీట్ మీల్ లో ఐస్ క్రీమ్ తింటానని చెప్పారు.
ఫిట్నెస్ ఉత్పత్తుల కంపెనీ 'సెక్రేడ్ బీస్ట్'ను ప్రారంభించిన సుధీర్ బాబు.
సుధీర్ బాబు పర్ఫెక్ట్ బాడీ రహస్యం
Sudheer Babu : మహేష్ బాబు బావ, హీరో సుధీర్ బాబు వరుస సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో పర్ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేసే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ప్రతి సినిమాలోనూ చాలా ఫిట్ గా కనిపిస్తారు. సోషల్ మీడియాలో కూడా తన ఫిట్నెస్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు తన సిక్స్ ప్యాక్ బాడీ కూడా చూపిస్తాడు సుధీర్ బాబు.(Sudheer Babu)
సుధీర్ బాబు నవంబర్ 7న జటాధరా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన డైట్ గురించి చెప్పుకొచ్చాడు.
సుధీర్ బాబు డైట్ ప్లాన్ వివరాలు
Also See : Sree Vishnu Daughter : హీరో శ్రీ విష్ణు కూతురు శారీ ఫంక్షన్ ఫోటోలు చూశారా? శ్రీ విష్ణు కూతురు మృద ఎంత క్యూట్ గా ఉందో..
సుధీర్ బాబు తన డైట్ గురించి మాట్లాడుతూ.. నేను రోజుకు అయిదారు సార్లు కొంచెం కొంచెం తింటాను. ఎగ్స్, మీట్, పుల్కా ఎక్కువగా తింటాను. రైస్ కూడా తింటాను. ఉదయాన్నే అయిదు ఎగ్స్ లేదా ఆమ్లెట్ తో పాటు రెండు రోటి లేదా పుల్కా, బ్రెడ్ తింటాను. ఎక్సర్‌సైజ్ కి తగ్గట్టు ప్రోటీన్ తీసుకుంటాను. మధ్యాహ్నం చికెన్, రైస్ తింటాను. వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా తింటాను. ఒకేసారి హాఫ్ కేజీ వెజిటేబుల్స్ వరకు తింటాను. అప్పుడు రైస్, మీట్ తక్కువ తింటాను. అలా కొంచెం కొంచెం రోజుకు అయిదు సార్లు తింటాను. చీట్ మీల్ రోజు ఐస్ క్రీమ్ భోజనం తిన్నట్టు తింటాను అని తన డైట్ ప్లాన్ చెప్పుకొచ్చారు.
కొత్తగా ఫిట్నెస్ బిజినెస్ లో సుధీర్ బాబు
అలాగే.. తాను సెక్రేడ్ బీస్ట్ అనే ఫిట్నెస్ కంపెనీ స్టార్ట్ చేసినట్టు తెలిపాడు. ఇందులో ప్రోటీన్ షేక్, పౌడర్లు ఉత్పత్తి చేస్తారు. ఫిట్నెస్ కి కావాల్సిన డైట్ సూచిస్తారు అని తెలిపారు.
మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఫిట్నెస్ పట్ల తన నిబద్ధతను, ఆరోగ్యకరమైన జీవనశైలిని స్పష్టంగా తెలిపారు. తన డైట్ ప్లాన్, కొత్త వ్యాపారం ‘సెక్రేడ్ బీస్ట్’ ద్వారా అభిమానులకు స్ఫూర్తినిస్తున్నారు.


