
📌 Key Points
- సుడిగాలి సుధీర్ హీరోగా ‘G.O.A.T’ చిత్రం మార్చి 26న విడుదల కానుంది.
- దివ్యభారతి హీరోయిన్‌గా, వేదవ్యాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
- నిర్మాతల చొరవతో సినిమాలోని వివాదాలు తొలగిపోయాయి.
- సినిమా ప్రమోషనల్ కంటెంట్, పాటలకు మంచి స్పందన లభించింది.
బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘G.O.A.T’ మూవీ మార్చి 26న విడుదల కానుంది. దివ్యభారతి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అనేక వివాదాల తరువాత విడుదలకు సిద్ధమైంది.
‘గోట్’ మూవీ విడుదల ఎప్పుడు?
Sudigali Sudheer: బుల్లితెరపై తిరుగులేని స్టార్‌గా దూసుకెళుతున్న సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer).. అప్పుడప్పుడు హీరోగా వెండితెరపై కూడా మెరుస్తున్నారు. ఒక మిడియం రేంజ్ హీరోకి ఉన్న ఫాలోయింగ్ సుడిగాలి సుధీర్‌కు ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎన్ని కష్టాలను దాటుకుని, ఈ రోజు ఆయన ఈ స్థాయికి చేరుకున్నాడు. అందుకే, ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. నలుగురిని నవ్వించడానికి తనని తాను ఎంత వరకైనా కించపరుచుకునే మెంటాలిటీ ఉన్న సుధీర్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తన ఫ్యాన్స్‌ని, ఫాలోయింగ్‌ని నమ్ముకునే.. వెండితెరపై కూడా తన సత్తా చాటాలని సమయం ఉన్న ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉంటారు. అందులో సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సుడిగాలి సుధీర్ రెడీ అయ్యారు.
వివాదాల నుంచి విడుదల
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం G.O.A.T (గోట్). Greatest Of All Times అనేది ఉపశీర్షిక. కోలీవుడ్ బ్యూటీ దివ్యభారతి (Divya Bharathi) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి వేదవ్యాస్ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకువస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. మధ్యలో హీరో, దర్శకుడు, హీరోయిన్‌ల మధ్య ఏర్పడిన ఈగో ఇష్యూతో ఈ సినిమా ఎటూ కాకుండా పోయింది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. పాటలు కూడా చార్ట్‌బస్టర్ సక్సెస్ అయ్యాయి. అందుకే నిర్మాతలు ఈ సినిమాను ఎలాగైనా విడుదల చేయాలని పట్టుబట్టి మరీ, ఏర్పడిన వివాదాలను దూరం చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా.. నిర్మాతల చొరవతో ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు నోచుకుంటోంది.
చిత్ర యూనిట్ వివరాలు
ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ (Chandrasekhar Reddy Mogulla) మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమా విడుదలకు సంబంధించి అన్ని కార్యక్రమాలను శరవేగంగా జరుగుతున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా ఉన్నతస్థాయిలో ఉంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి మెసేజ్ కూడా దాగి ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాలని ప్రేక్షకులను కోరుకుంటున్నానని తెలిపారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
చివరికి, నిర్మాతల పట్టుదల వలన ‘గోట్’ చిత్రం విడుదల కానుంది. సుధీర్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


