
📌 Key Points
- సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా ‘G.O.A.T’ చిత్రం, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ట్యాగ్ లైన్ తో రాబోతుంది!
- లియోన్ జేమ్స్ సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ‘రైజ్ ఆఫ్ గణ’ పాట విడుదలైంది, వినోద్ ఏలుమలై గానం!
- గతంలో ప్రమోషన్లకు దూరంగా ఉన్న సుధీర్, తాజాగా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు.
- సుధీర్ కెరీర్‌లో ఈ సినిమా మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని నిర్మాత ప్రకటన, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
సుడిగాలి సుధీర్ అభిమానులకు ఒక అదిరిపోయే న్యూస్! ఎట్టకేలకు సుధీర్ తన కొత్త సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ‘G.O.A.T’ చిత్రం నుంచి ఒక మాస్ సాంగ్ విడుదలైంది. ఇక రచ్చ మామూలుగా ఉండదు!
G.O.A.T నుంచి ‘రైజ్ ఆఫ్ గణ’ సాంగ్ రిలీజ్!
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా తెరకెక్కుతున్న సినిమా G.O.A.T(గోట్) గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ట్యాగ్ లైన్. మహాతేజ క్రియేషన్స్, జైష్ణవ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై చంద్రశేఖర్ రెడ్డి నిర్మాణంలో వేదవ్యాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా మరో సాంగ్ ని రిలీజ్ చేరేశారు.(Sudigali Sudheer)
తాజాగా ఈ సినిమా నుంచి ‘రైజ్ ఆఫ్ గణ..’ అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. లియోన్ జేమ్స్ సంగీత దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ రాయగా వినోద్ ఏలుమలై ఈ పాటను పాడారు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
ప్రమోషన్స్‌లో సుడిగాలి సుధీర్ సందడి!
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో గతంలో సుడిగాలి సుధీర్ పాల్గొనలేదు. దర్శకుడికి మూవీ టీమ్ కి వివాదం అవడంతో సుధీర్ కూడా సైలెంట్ అయ్యాడు. దీంతో సుధీర్ ప్రమోషన్స్ కి రాకపోవడం చర్చగా మారింది. కానీ నేడు సుడిగాలి సుధీర్ ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఓ ఇంజనీరింగ్ కళాళాలలో జరిగిన ఈవెంట్‌లో ఈ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్ కి సుధీర్, దివ్యభారతి, మూవీ టీమ్ హాజరయి సందడి చేసారు. దీంతి సింధీర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సుధీర్ కెరీర్ లోనే మైలురాయిగా ఈ సినిమా!
ఈ ఈవెంట్లో నిర్మాత మాట్లాడుతూ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ సినిమా మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. అని అన్నారు.
సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ మూవీతో వస్తున్నాడు! ఫ్యాన్స్ అందరూ సిద్ధంగా ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. మీకోసం ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంటాం.


