
📌 Key Points
- హీరోయిన్ పక్కన నిలబడే అర్హత లేదని అవమానించిన సంఘటనను గుర్తు చేసుకున్న సుహాస్.
- కీర్తి సురేష్‌తో కలిసి ‘ఉప్పు కప్పురంబు’ సినిమాలో నటించిన సుహాస్.. ఇది నా సక్సెస్ అన్నారు.
- ‘హే బల్వంత్’ మూవీలో శివాని నాగారం, సుహాస్ జంటగా నటిస్తున్నారు; గోపి అచ్చర దర్శకత్వం వహిస్తున్నారు.
- చిన్న పాత్రల నుండి హీరోగా ఎదిగిన సుహాస్.. ఇప్పుడు స్టార్ నటుడిగా గుర్తింపు పొందాడు.
టాలీవుడ్ హీరో సుహాస్ కెరీర్ ఆరంభంలో ఎదురైన అవమానాల గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఒకప్పుడు హీరోయిన్ పక్కన నిలబడే అర్హత లేదని అన్నవారే ఇప్పుడు ఆశ్చర్యపోయేలా ఎదిగారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
సుహాస్‌కు అవమానం: కెరీర్ తొలినాళ్లలో చేదు అనుభవం!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది హీరోలు పాపులర్ అవుతుంటే… మరికొంతమంది మరింత కష్టపడుతున్నారు. సక్సెస్ వచ్చేవరకు తగ్గేదే లేదు అంటున్నారు. అయితే చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోగా మారిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో తెలుగు హీరో సుహాస్ ఒకరు. ఈ తెలుగు హీరో సుహాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చిన్న చిన్న పాత్రలు చేసి హీరోగా అవతారం ఎత్తాడు సుహాస్.
కలర్ ఫోటో సినిమాతో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న సుహాస్, ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. రైటర్ పద్మనాభం, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న సుహాస్, విలన్ గా కూడా మెరుస్తున్నాడు. హిట్ సినిమాలో నెగిటివ్ రోల్ చేసిన సుహాస్, మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు.
కీర్తి సురేష్‌తో కలిసి నటించిన సుహాస్.. సంచలన వ్యాఖ్యలు!
వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్న హీరో సుహాస్ , తన కెరీర్ ప్రారంభంలో అనేక రకాల కష్టాలు పడ్డారట. ఇందులో భాగంగానే ఓ సన్నివేశాన్ని తాజాగా పంచుకున్నారు. ఓ సినిమాకు యాక్టర్ గా వెళ్ళినప్పుడు.. పెద్ద హీరోయిన్ తో క్లోజ్ గా ఉండే పాత్ర తనకు దక్కిందని ‘హే బల్వంత్’ సినిమా ఈవెంట్ సందర్భంగా పేర్కొన్నారు హీరో సుహాస్. అయితే పెద్ద హీరోయిన్ పక్కన తాను పనికిరాని అక్కడ ఉన్న ఓ వ్యక్తి కామెంట్స్ చేశారట. ఇతన్ని ఎందుకు పిలిచారని అక్కడే తనను అవమానించారని సుహాస్ తెలిపారు. దాంతో వెనక్కి వచ్చిన తాను ఇప్పుడు స్టార్ నటుడిగా ఎదిగినట్లు వెల్లడించారు సుహాస్. అక్కడ కట్ చేస్తే, కీర్తి సురేష్ గారితో ఉప్పు కప్పు రంబు సినిమా ( Uppu Kappurambu Movie ) చేశానని గుర్తు చేసుకున్నారు. నా విషయంలో ఇది సక్సెస్ అంటూ వ్యాఖ్యానించారు. పెద్ద హీరోయిన్ పక్కన తాను పనికిరాని అన్న వాళ్ళు ఇప్పుడు ముక్కున వేలు వేసుకుంటున్నారని చురకలు అంటించారు. అంతేకాదు కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు తాను కనిపిస్తే హగ్గు కూడా ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో సుహాసి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
‘హే బల్వంత్’ మూవీతో సుహాస్ మరో హిట్ కొట్టేనా?
శివాని నాగారం, సుహాస్ ( Suhas) జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘హే బల్వంత్’. వాస్తవంగా మొదటగా ఈ సినిమాకు హే భగవాన్ అని ఫిక్స్ చేశారు. కానీ సెన్సార్ బోర్డు నో చెప్పడంతో టైటిల్ మార్చారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు ‘హే బల్వంత్’ అని టైటిల్ ఫైనల్ చేశారు. గోపి అచ్చర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో నరేష్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. క్లిక్
సుహాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘హే బల్వంత్’ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


