|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజశేఖరే సుకుమార్ స్ఫూర్తి! సంచలన విషయాలు బయటపెట్టిన డైరెక్టర్ సుకుమార్!

Published: 11-01-2026, 4:15 AM
రాజశేఖరే సుకుమార్ స్ఫూర్తి! సంచలన విషయాలు బయటపెట్టిన డైరెక్టర్ సుకుమార్!
  • సుకుమార్ దర్శకుడు కావడానికి రాజశేఖర్ స్ఫూర్తి అని స్వయంగా చెప్పారు.
  • ఆర్య సినిమాతో సుకుమార్ దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు.
  • నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్ లుక్ మార్చిన సుకుమార్.
  • పుష్ప 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది.

ప్రముఖ దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. సుకుమార్ ఇండస్ట్రీకి రావడానికి గల కారణం ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ అని ఆయన స్వయంగా వెల్లడించారు.

సుకుమార్ సినీ ప్రస్థానం వెనుక ఎవరు?

HBD Sukumar:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుడిగా క్రియేటివ్ జీనియస్ గా పేరు సొంతం చేసుకున్నారు సుకుమార్ (Sukumar ). ఆర్య సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన.. ఈ సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్నారు. ట్రెండ్ కి భిన్నంగా సినిమాలు తీస్తూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న సుకుమార్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆయన ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఎవరు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది

అసలు విషయంలోకి వెళ్తే.. సుకుమార్ ఇండస్ట్రీకి రావడానికి కారణం ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ అట. ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీలోకి వచ్చినట్లు ఒక సందర్భంలో స్వయంగా సుకుమార్ తెలిపారు. సుకుమార్ మాట్లాడుతూ.. నేను హీరో రాజశేఖర్ కి వీరాభిమానిని. ముఖ్యంగా ఆయన నటించిన మగాడు, తలంబ్రాలు, ఆగ్రహం, అంకుశం, ఆహుతి వంటి చిత్రాలు నన్ను ఎంతగానో ప్రేరేపించాయి. చదువుకునే రోజుల్లోనే నేను ఆయనను ఇమిటేట్ చేసేవాడిని. నా పెర్ఫార్మన్స్ మెచ్చి అందరూ కూడా ఇంకొకసారి చెప్పు అని అడిగేవాళ్లు. అలా నేను కూడా ఫేమస్ అయిపోయాను. ఇక సినిమాల్లోకి వెళ్లి ఏదైనా చేయగలను అనే నమ్మకం వచ్చింది కూడా రాజశేఖర్ వల్లే”.. అంటూ చెప్పుకొచ్చారు. సుకుమార్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రాజశేఖర్ స్ఫూర్తితో ఇండస్ట్రీకి సుకుమార్

సుకుమార్ విషయానికి వస్తే.. ఆర్యతో మొదటి సక్సెస్ అందుకున్న ఈయన.. ఆ తర్వాత జగడం, ఆర్య 2 , 100% లవ్, నేనొక్కడినే వంటి చిత్రాలు చేసి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో సినిమా ఆయనకు మంచి కమర్షియల్ సక్సెస్ ను అందించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ మేకోవర్ ను పూర్తిగా మార్చేసి, అతనికి ఒక కొత్త లుక్ ను ఇచ్చేలా చేశాడు. ముఖ్యంగా ఈ లుక్ నాన్నకు ప్రేమతో సినిమా విడుదలయ్యే సమయంలో చాలా ఫేమస్ కూడా అయిపోయింది. ఇకపోతే రంగస్థలం సినిమాతో జోనర్ మార్చి తనలోని మాస్ యాంగిల్ ని కూడా అందరికీ పరిచయం చేశారు.

పుష్ప , పుష్ప 2 చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా డైరెక్టర్గా చలామణి అవుతున్నారు. అంతేకాదు పుష్ప 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన రెండవ చిత్రంగా కూడా ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఇక అలా తన అద్భుతమైన డైరెక్షన్ విలువలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు సుకుమార్. ప్రస్తుతం రామ్ చరణ్ తో రంగస్థలం 2 తెరకెక్కించబోతున్నారు.

పుష్ప 2 సంచలన రికార్డులు

ఇకపోతే సుకుమార్ ఏ పనిలో అయితే గుర్తింపు తెచ్చుకున్నారో ఆయన దగ్గర దర్శకత్వంలో మెలుకువలు నేర్చుకొని ఇప్పుడు వారు కూడా ఇండస్ట్రీలో దర్శకులుగా చలామణి అవుతున్నారు. అలాంటి వారిలో బుచ్చిబాబు సన, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ వర్మ దండు, పల్నాటి సూర్య ప్రతాప్ లాంటి వారంతా కూడా మంచి సినిమాలతో భారీ పాపులారిటీ అందుకున్నారు.

ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తారని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.