|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ కన్నడ బ్యూటీపై కన్ను.. సుకుమార్ భారీ ప్లాన్ !

Published: 06-07-2025, 6:45 AM
ఆ కన్నడ బ్యూటీపై కన్ను.. సుకుమార్ భారీ ప్లాన్ !

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ తన తర్వాతి సినిమాను రామ్ చరణ్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం.

Key Points

1

సుకుమార్ తన తర్వాతి సినిమాకు రామ్ చరణ్‌ను ఎంచుకున్నారు.

2

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది.

4

సినిమా షూటింగ్ వచ్చే ఏడాది లేదా ఈ ఏడాది చివర్లో మొదలవుతుంది.

సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది మాత్రమే మంచి సక్సెస్ అందుకొని దూసుకు వెళ్తున్నారు. అలాంటి వారిలో సుకుమారు ఒకరు. దర్శకుడు సుకుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన తీసిన ప్రతి సినిమా బంపర్ హిట్ కావడం గ్యారెంటీ. కథతో సినిమా వచ్చిందంటే మినిమం గ్యారంటీ అందుకుంటుంది.

హీరోయిన్ ఎంపిక

పుష్ప 2 సినిమాతో ఇండస్ట్రీని మొత్తం షేక్ చేశాడు. అలాంటి సుకుమార్ తన తర్వాతి సినిమా రామ్ చరణ్ తో తీయబోతున్నాడని జోరుగా ప్రచారం అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే సుకుమార్ తో సినిమాకు రెడీ అవుతాడట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan ). అయితే ఈ సినిమా నేపథ్యంలో ఇప్పటి నుంచే హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారట సుకుమార్ (sukumar).

సినిమా ప్రారంభం

చరణ్ తో సినిమా కోసం కన్నడ బ్యూటీ ని కూడా టచ్ చేసినట్లు తెలుస్తోంది. చరణ్ కు జోడిగా రుక్మిణి వసంత్ ను (rukmini vasanth) తీసుకుంటే బాగుంటుందని సుకుమార్ ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా చేశారట. దీంతో ఆమె సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాక ఈ సినిమా వచ్చే ఏడాది లేదా ఈ ఏడాది చివరలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

సుకుమార్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించడం ఖరారైతే, ఈ సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.