|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శిష్యుల‌తో సుకుమార్ భారీ ప్లానింగ్‌..ఏకంగా ఇద్ద‌రు యువ హీరోల‌తో !

Published: 21-10-2025, 3:10 AM
శిష్యుల‌తో సుకుమార్ భారీ ప్లానింగ్‌..ఏకంగా ఇద్ద‌రు యువ హీరోల‌తో !

స్టార్ దర్శకుడు సుకుమార్, తన శిష్యుల‌తో కలిసి భారీ ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో రెండు కొత్త సినిమాలు రానున్నాయి. కిరణ్ అబ్బవరం, సుమంత్ ప్రభాస్ హీరోలుగా శిష్యులు వీరా, మాధురి దర్శకత్వంలో ఈ చిత్రాలు రూపొందనున్నాయి.

Key Points

1

సుకుమార్ రైటింగ్స్‌లో రెండు కొత్త చిత్రాలు రానున్నాయి.

2

కిరణ్ అబ్బవరం, సుమంత్ ప్రభాస్‌లతో సినిమాలు ఖరారు.

4

ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టులు తెరకెక్కనున్నాయి.

సుకుమార్ రైటింగ్స్‌లో కొత్త సినిమాలు

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ గురించి తెలియని వారు ఉండరు. పుష్ప సినిమాతో ప్రపంచ స్థాయికి ఎదిగిన దర్శకుడు సుకుమార్. స్మగ్లింగ్ పై సినిమా తీసిన కూడా జనాలు ఎగబడి చూశారు. అంత అద్భుతంగా కథ రాస్తాడు సుకుమార్. అయితే అలాంటి సుకుమార్ రైటింగ్స్ లో రెండు కొత్త సినిమాలు రాబోతున్నాయట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సుకుమార్ తన ఇద్దరు శిష్యులతో ఈ సినిమాలు చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో కిరణ్ అబ్బవరంతో ఒక సినిమా ఫైనల్ అయిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

దీనికి సుకుమార్ శిష్యులు వీరా దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త కుర్రాడు సుమంత్ ప్రభాస్ తో మరో సినిమా కూడా ఓకే చేశారట. దీనికి మాధురి అనే అమ్మాయి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈమె కూడా సుకుమార్ శిష్యురాలే కావడం గమనార్హం. ఈ సినిమాలన్నీ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ రెండు సినిమాలు కూడా ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రొడక్షన్ లోనే వస్తాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అటు ఇప్పటికే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు, చరణ్ హీరోగా పెద్ది సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సుకుమార్ శిష్యులే ఇండస్ట్రీని వెళ్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కిరణ్ అబ్బవరం, సుమంత్ ప్రభాస్‌లతో ప్రాజెక్ట్స్

దర్శకులుగా సుకుమార్ శిష్యులు

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో యువ హీరోలతో వస్తున్న ఈ కొత్త ప్రాజెక్టులు టాలీవుడ్‌లో ఆసక్తిని రేపుతున్నాయి. సుకుమార్ శిష్యులు ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.