|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సుమ కనకాల పాడిన ఏకైక ఐటెం సాంగ్, ఘోరం జరిగిపోయింది అంటూ.. అనసూయ రియాక్షన్ ఇదే

Published: 26-05-2025, 7:28 AM
సుమ కనకాల పాడిన ఏకైక ఐటెం సాంగ్, ఘోరం జరిగిపోయింది అంటూ.. అనసూయ రియాక్షన్ ఇదే

ప్రముఖ యాంకర్ సుమ కనకాల తన కెరీర్‌లో ఒకే ఒక్క ఐటెం సాంగ్‌కు గానం చేశారు. ఆ పాట ‘విన్నర్’ సినిమాలో అనసూయపై చిత్రీకరించబడింది. సుమ మరియు అనసూయల రియాక్షన్లు ఆసక్తికరంగా ఉన్నాయి.

Key Points

1

సుమ కనకాల 'విన్నర్' సినిమాలో అనసూయ ఐటెం సాంగ్‌కు గానం చేశారు.

2

సుమ కెరీర్‌లో ఇది ఏకైక ఐటెం సాంగ్.

4

సుమ ఈ ఘటనను 'ఘోరం' అంటూ వినోదాత్మకంగా వర్ణించారు.

సుమ కనకాల అరుదైన ఐటెం సాంగ్

టాలీవుడ్ లో సుమ కనకాల టాప్ యాంకర్. బుల్లితెరపై యాంకర్ గా షోలు చేస్తూ, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో తనదైన శైలిలో సుమ హంగామా చేస్తుంటారు. సుమ నటిగా కూడా రాణించారు. అప్పుడప్పుడు ఆమె నటిగా సినిమాలు చేయడం చూస్తూనే ఉన్నాం. సమ చివరగా జయమ్మ పంచాయితీ అనే చిత్రంలో నటించారు.

యాంకర్ గా, నటిగా మాత్రమే కాదు సుమ మరో ప్రయోగం కూడా చేశారు. ఆమె ఒక చిత్రంలో పాట పాడిన సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. సుమ తన కెరీర్ లో ఒకే ఒక్క పాట పాడారు.. అది కూడా ఐటెం సాంగ్. ఈ సాంగ్ లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ పాటని సుమ మరో యాంకర్ అనసూయ కోసం పాడారు. సాయి ధరమ్ తేజ్ విన్నర్ చిత్రంలో అనసూయ ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. తన పేరు పైనే ఆ సాంగ్ ఉంటుంది. ‘సూయ సూయ సూయ అట్టా ఎట్టా పుట్టేశావే అనసూయ ‘ అంటూ సాగే పాట అది.

అనసూయ ప్రతిస్పందన

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటని సమతో పాడించి ప్రయోగం చేశారు. ఈ సాంగ్ లో నటించిన తర్వాత అనసూయ మాట్లాడుతూ.. నా పేరుతో సాంగ్ ఉండడం, దాంట్లో నేను నటించడం, ఆ పాటని నాకు ఇష్టమైన వ్యక్తి పాడడం.. ఇవన్నీ చూస్తుంటే నాకే నమ్మశక్యంగా లేదు. కానీ ఇదంతా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, సాయి ధరమ్ తేజ్ లకు నా కృతజ్ఞతలు.

ఈ పాట రాసిన రామ జోగయ్య శాస్త్రి గారికి, పాడిన సుమ గారికి కూడా థాంక్స్ చెప్పాలి అని అనసూయ పేర్కొంది. ఈ సాంగ్ పాడిన తర్వాత యాంకర్ సుమ అయితే ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. మీకు ఇది వినడానికి షాకింగ్ గా అనిపించొచ్చు. మీరు ఎలా ఫీలయినా ఘోరం మాత్రం జరిగిపోయింది. నేను విన్నర్ చిత్రంలో పాట పాడాను. అది అనసూయ నటించిన పాట.

సుమ వినోదాత్మక వ్యాఖ్యలు

నేను ఇప్పటివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లలో కేవలం యాంకరింగ్ మాత్రమే చేశాను. ఎప్పుడూ పాట పాడే సాహసం చేయలేదు. కానీ తమన్ గారికి నా చేత పాట పాడించాలని ఎందుకనిపించిందో నాకు తెలియదు. మొత్తానికి పాడేశాను అంటూ సుమ ఫన్నీ కామెంట్స్ చేసింది. విన్నర్ చిత్రం హిట్ కాకపోయినప్పటికీ అనసూయ ఐటెం సాంగ్ మాత్రం బాగా వైరల్ అయింది.

సుమ కనకాల చేసిన ఈ అరుదైన ప్రయోగం సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనసూయ, సుమ ఇద్దరి ప్రతిస్పందనలు ఈ ఘటనకు మరింత ప్రాముఖ్యతను చేకూర్చాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.