
📌 Key Points
- సుమన్ కెరీర్‌ను దెబ్బతీయడానికి చిరంజీవి ప్రయత్నించారనే పుకార్లను సుమన్ ఖండించారు.
- చిరంజీవి తన మధ్య స్నేహం గురించి, 80s నటుల రీయూనియన్ గురించి సుమన్ వివరించారు.
- యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు.
- జర్నలిజం విలువలను కాపాడాలని, వ్యక్తిగత జీవితాలపై ఆధారాలు లేకుండా రాయకూడదని సుమన్ సూచించారు.
ఒకప్పుడు అగ్ర నటుడిగా వెలుగొందిన సుమన్ తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడారు. తనను జైలుకు పంపడంలో చిరంజీవి పాత్ర ఉందనే పుకార్లను ఆయన ఖండించారు. చిరంజీవితో తన స్నేహం గురించి ఆయన వివరించారు.
చిరంజీవితో నా స్నేహం ఎప్పటికీ చెరగదు: సుమన్
Suman Chiranjeevi: తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు సుమన్ అగ్ర కథానాయకుడిగా వెలుగుతున్న సమయంలో ఆయన కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో సుమన్ కెరీర్‌ను దెబ్బతీయడానికి చిరంజీవి ప్రయత్నించారనే ప్రచారం అప్పట్లో బలంగా సాగింది. అయితే, దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉండటంపై సుమన్ తీవ్రంగా స్పందించారు. పుకార్ల వెనుక వికృత మనస్తత్వం కలిగిన వ్యక్తుల ఉన్నారని ఆయన అన్నారు. సుమన్ ఎదుర్కొన్న పాత కేసులో చిరంజీవి ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన ఈ ఇంటర్వ్యూలో స్పష్టంగా తేల్చి చెప్పారు. చిరంజీవిని వ్యతిరేకించే వారు లేదా ఆయనపై ద్వేషం ఉన్నవారు మాత్రమే కావాలని ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తూ ఆనందం పొందుతున్నారని ఆయన విమర్శించారు. దీనిని ఒక రకమైన ‘సాడిజం’ లేదా ‘పర్వర్షన్’ గా సుమన్ అభివర్ణించారు. చిరంజీవి వంటి గొప్ప వ్యక్తిని మానసిక వేధింపులకు గురిచేయాలనే లక్ష్యంతోనే కొందరు పనిగట్టుకుని ఇలాంటి పోస్టులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
Read also- Apple TV 2026 Release : ‘ఇంపర్ఫెక్ట్ ఉమెన్’ నుండి ‘మార్గోస్ గాట్ మనీ ట్రబుల్స్’ వరకు… 2026లో రిలీజ్ కానున్న మోస్ట్ అవైటింగ్ సిరీసులు
తప్పుడు వార్తలపై సుమన్ ఆగ్రహం
మా మధ్య ఉన్నది అపారమైన స్నేహం చిరంజీవి, తన మధ్య ఎలాంటి శతృత్వం లేదని, తాము ఇప్పటికీ అత్యంత సన్నిహిత మిత్రులమని సుమన్ వెల్లడించారు. ప్రతి ఏడాది జరిగే ’80s నటుల రీయూనియన్’ కార్యక్రమంలో తామంతా ఒకే కుటుంబంలా గడుపుతామని చెప్పారు. “మేము కలిసినప్పుడు సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ప్రపంచాన్ని మర్చిపోయి కబుర్లు చెప్పుకుంటాం. అక్కడ ఎవరు హీరో, ఎవరికి ఎంత మార్కెట్ ఉంది అనే భేదాలు ఉండవు. అందరం నేల మీద కూర్చుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పాటలు, డాన్సులతో సరదాగా గడుపుతాం” అని తన మరియు చిరంజీవి మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించారు.
Read also- AAFA Meeting: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం.. నెక్స్ట్ ఏంటంటే?
జర్నలిజం విలువలు పాటించాలి: సుమన్
మీడియా జర్నలిజంపై హితవు ప్రస్తుత కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు కేవలం వ్యూస్ కోసం తప్పుడు థంబ్ నెయిల్స్‌తో నటుల మరణవార్తలను లేదా అక్రమ సంబంధాల గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిజం అనేది అత్యంత గౌరవప్రదమైన వృత్తి అని, ఆధారాలు లేకుండా ఎవరి వ్యక్తిగత జీవితంపై వార్తలు రాయడం సరికాదని ఆయన సూచించారు. ముఖ్యం గా చిరంజీవి గారిని టార్గెట్ చేయడం మానుకోవాలని కోరారు. చివరగా, సుమన్ తన ఇంటర్వ్యూ ద్వారా స్పష్టం చేసింది ఒక్కటే – చిరంజీవికి మరియు ఆయన ఎదుర్కొన్న పాత వివాదాలకు ఎలాంటి సంబంధం లేదు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని, అభిమానులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. దీంతో ఎప్పటినుంచో జబాబులేని ప్రశ్నగా ఉన్న దానికి ఇప్పుడు ఆన్సర్ దొరికినట్లయింది.
చిరంజీవికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సుమన్ తేల్చి చెప్పారు. వారి మధ్య స్నేహబంధం ఎప్పటికీ కొనసాగుతుందని ఆయన నొక్కి చెప్పారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు.


