
బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్‌లో సుమన్ శెట్టి భార్య హౌస్‌లోకి వచ్చి భావోద్వేగ క్షణాలను పంచింది. కేవలం 20 నిమిషాల సమయం దొరికినా, సుమన్ తన భార్యతో ఆప్యాయంగా ముద్దుపెట్టుకొని, సరదాగా డ్యాన్స్ చేసి, ఆహారం పంచుకొని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Key Points
సుమన్ శెట్టి భార్య బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్‌లో హౌస్‌లోకి వచ్చింది.
బిగ్‌బాస్ కేవలం 20 నిమిషాలు మాత్రమే గడపడానికి అనుమతి ఇచ్చారు.
సుమన్ శెట్టి తన భార్యకు బుగ్గపై ముద్దుపెట్టి ప్రేమను వ్యక్తం చేశాడు.
ఇద్దరూ కలిసి సరదాగా డ్యాన్స్ చేసి, ఒకరికొకరు ఆహారం తినిపించుకున్నారు.
బిగ్‌బాస్ హౌస్‌లో సుమన్ శెట్టికి సర్‌ప్రైజ్
బిగ్‌బాస్ షోలో ఫ్యామిలీ వీక్ కోసం ప్రతిఒక్కరూ ఎదురుచూస్తారు. ఎందుకంటే మిగతా రోజులు ఎంత గొడపడ్డా సరే ‘ఫ్యామిలీ వీక్’ వచ్చేసరికి హౌస్‌మేట్స్ అందరూ ఒక్కటవుతారు. చూస్తున్నంతసేపు నిజమైన ఎమోషన్స్ బయటకొస్తాయి. అందుకే ప్రేక్షకులు కూడా ప్రతి సీజన్‌లోనూ దీనికోసమే ఎదురుచూస్తుంటారు. ఈసారి 9వ సీజన్‌లో మొదలైపోయింది. ఇప్పటికే తనూజ కుటుంబ సభ్యులు రాగా.. సుమన్ శెట్టి భార్య కూడా హౌస్‌లోకి వచ్చింది. ఈ ప్రోమో చాలా బాగుంది.
తొలుత సుమన్ శెట్టిని కన్ఫెషన్ గదికి పిలిచిన బిగ్‌బాస్.. మీరు పొందిన టైమ్ కార్డ్ ద్వారా మీ కుటుంబ సభ్యునితో 20 నిమిషాలు మాత్రమే గడపగలరు అని చెప్పారు. మరీ ఇంత తక్కువ సమయమేనా అని సుమన్ బాధపడ్డాడు గానీ గార్డెన్ ఏరియాలో ఉన్న తన భార్యని చూసి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. బుగ్గపై ముద్దుపెట్టి మరీ ఎలా ఉన్నావ్ అని క్యూట్‌గా అడిగాడు.
భార్యతో భావోద్వేగ క్షణాలు, ముద్దులు
అలానే అమ్మ ఆరోగ్యం ఎలా ఉందని సుమన్ చాలా బెంగపడుతూ భార్యని అడిగాడు. బాగానే ఉన్నారని చెప్పడంతో.. గౌతమ్ రాలేదేమీ అంటూ తన బిడ్డ గురించి సుమన్ అడిగాడు. ఒక్కరికే పర్మిషన్ ఇచ్చారని చెప్పడంతో ఊరుకున్నాడు. బాగా ఆడుతున్నానా అని తన ఆట గురించి భార్యని స్వీటుగా అడిగాడు. చాలా బాగా ఆడుతున్నావ్ అని చెప్పిన సుమన్ భార్య.. నీకు ఇష్టమని ఫుడ్ తెచ్చానని చెప్పింది. ఇది ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.
డ్యాన్స్, సరదాగా గడిపిన జంట
నువ్వు తిను, నువ్వు తిను అంటూ సుమన్, అతడి భార్య ఒకరికి ఒకరు ఆప్యాయంగా తినిపించుకున్నారు. ఇది అయిన తర్వాత గార్డెన్ ఏరియాలో ఇద్దరూ కలిసి చిన్న స్టెప్పులేస్తూ డ్యాన్స్ చేశారు. అదే టైంలో మిగిలిన హౌస్‌మేట్స్ కూడా వీళ్లని ఎంకరేజ్ చేస్తూ సంతోషంగా గంతులేశారు. ప్రోమోనే ఇంత బాగుందంటే.. ఎపిసోడ్ ఇంకెంత బాగుండబోతుందో?
ఈ ఎపిసోడ్ ప్రోమోనే ఇంత అద్భుతంగా ఉంటే, పూర్తి ఎపిసోడ్ ఇంకెంత భావోద్వేగంగా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమన్ శెట్టి, తన భార్య మధ్య అనుబంధం అందరినీ కదిలించింది.


